
రజాక్ మా వాడే: ఐసిస్
వాషింగ్టన్: అమెరికాలోని ఒహయో స్టేట్ యూనివర్సిటీలో సోమవారం కారుతో ఢీకొట్టి, కత్తితో దాడిచేసి 11 మందిని గాయపరిచిన విద్యార్థి ఇంతకు పూర్వం పాకిస్తాన్‌లో నివసించాడని తెలిసింది. అతన్ని 18 ఏళ్ల అబ్దుల్ రజాక్ అలీ అర్తాన్‌గా గుర్తించారు. సోమలియా దేశస్తుడైన రజాక్ 2007–2014 మధ్య కాలంలో పాక్‌లో ఉన్నట్లు అమెరికా అధికారులు చెప్పారు. ‘ముస్లిం దేశాల వ్యవహారాల్లో తలదూర్చడాన్ని అమెరికా ఆపాలి’ అని రజాక్ దాడికి ముందు ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినట్లు మీడియా తెలిపింది.
కాగా, రజాక్ తమ వాడేనని ఇస్లామిక్ స్టేట్(ఐసిస్) ఉగ్రవాద సంస్థ తెలిపింది. అతడిని తమ ‘సైనికుడి’గా వర్ణించింది. అయితే అతడికి ఐసిస్ తో సంబంధాలు ఉండకపోవచ్చని అంచనా వేస్తున్నారు. రజాక్ ను ఉద్దేశపూర్వకంగానే తమ వాడిగా ఐసిస్ ప్రకటించుకుందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.