మా నాన్నతో పోట్లాడతా: ట్రంప్ కుమార్తె
క్లీవ్ లాండ్: తన తండ్రికి ఎటువంటి వర్ణ వివక్ష లేదని డొనాల్డ్ ట్రంప్ కుమార్తె ఇవాంక అన్నారు. క్లీవ్‌లాండ్‌లో జరిగిన రిపబ్లికన్ పార్టీ జాతీయ సదస్సులో నాలుగో రోజు ఆమె ప్రసంగించారు. అమెరికా అధ్యక్ష అభ్యర్థిగా ప్రజలే ఆయనను ఎన్నుకున్నారని ఆమె వ్యాఖ్యానించారు. దేశం కోసం, ప్రతిభను గుర్తించేందుకు తన తండ్రి నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారని చెప్పారు.
'మా నాన్నకు వర్ణవివక్ష లేదు. లింగ సమానత్వం పాటిస్తారు. ప్రతి ఒక్కరి అభిప్రాయాలను శ్రద్ధగా వినడం వల్లే ఆయన విజయవంతమైన వ్యాపారవేత్తగా ఎదిగారు. స్వప్నాలను సాకారం చేయడానికి ఆయన నిరంతం శ్రమిస్తుంటార'ని ఇవాంక చెప్పారు. కార్మిక, బాలల చట్టాలను ఆయన మెరుగు పరుస్తారన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 'సమాన వేతనాల కోసం ఆయన పోరాడతారు. ఆయనతో నేను పోరాడతా'నని పేర్కొన్నారు. కాగా, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిత్వాన్ని వినమ్రంగా అంగీకరిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.