రింగ్‌లో మట్టికరిపించి ప్రేమలో పడ్డారు | John Cena Proposed to Nikki Bella Inside WrestleMania Ring | Sakshi
Sakshi News home page

రింగ్‌లో మట్టికరిపించి ప్రేమలో పడ్డారు

Published Mon, Apr 3 2017 9:53 AM | Last Updated on Tue, Sep 5 2017 7:51 AM

రింగ్‌లో మట్టికరిపించి ప్రేమలో పడ్డారు

రింగ్‌లో మట్టికరిపించి ప్రేమలో పడ్డారు

ఓర్లాండో: ఓ ఆటలోగానీ, పోటీలోగానీ విజయం అనంతరం తమకు నచ్చిన ప్రేయసికి, ప్రియుడికి ప్రపోజ్‌ చేసే సన్నివేశాలు చాలా అరుదుగా కనిపిస్తుంటాయి. అప్పటి వరకు చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోయినా తాను విజయం సాధించినచోట మనుసులో ఉన్న వ్యక్తి అక్కడే ఉండి ఉంటే మాత్రం ప్రేమ తన్నుకొని రావడం మాత్రం ఖాయం. సరిగ్గా రెజ్లింగ్‌ స్టార్‌ జాన్‌ సేనా విషయంలో అదే జరిగింది. ఎప్పటి నుంచో తనతోపాటు రెజ్లింగ్‌లో పాల్గొనే నిక్కి బెల్లాను ప్రేమిస్తున్నప్పటికీ ఇప్పటి వరకు ఆ మాటను బయటకు చెప్పని జాన్‌ సేనా అనూహ్యంగా ప్రపోజ్‌ చేసి అందరినీ అబ్బురపరిచాడు.

ఆదివారం ఓర్లాండోలో రెజ్లింగ్‌ మానియా 33 జరిగింది. రింగ్‌లో జాన్‌ సేనా, నిక్కి బెల్లా కలిసి తమ ప్రత్యర్థులు మిజ్‌, మార్సిని మట్టికరిపించారు. ఈ విజయం సాధించిన వెంటనే ఎవరూ ఊహించని విధంగా వెంటనే ఆకాశంవైపు ఓసారి చూసి మోకాలిపై కూర్చుని తనతోపాటు రెజ్లింగ్ రింగ్‌లో ఉన్న నిక్కీవైపు చూస్తూ ఓ వజ్రపు ఉంగరాన్ని తనకిస్తూ ప్రపోజ్‌ చేశాడు. ఇక తాను ఆగలేనని, ఈ మాట ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నానని, తనను పెళ్లి చేసుకుంటావా అని అడిగేశాడు. దాంతో ఎగిరిగంతేసినంత పనిచేసిన నిక్కీ కూడా తనకు కూడా చాలా ఇష్టమే అని సంతోషాన్ని వ్యక్తం చేస్తూ రింగ్‌లోనే అందరూ చూస్తుండగా జాన్‌ సేనాను ఆలింగనం చేసుకొని లిప్‌లాక్‌తో మైమరిపించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement