![John Cena announces retirement from wrestling](/styles/webp/s3/article_images/2024/07/7/johnsena1.jpg.webp?itok=PlzuQFnH)
స్టార్ రెజ్లర్, WWE వరల్డ్ లెజెండ్ జాన్ సినా తన కెరీర్‌కు విడ్కోలు పలికేందుకు సిద్దమయ్యాడు. 2025లో జరిగే రెసల్ మేనియా అనంతరం తన కెరీరీను ముగించనున్నట్లు జాన్ సినా ప్రకటించాడు. కెనడాలో జరుగుతున్న డబ్ల్యూడబ్ల్యూఈ (WWE) మనీ ఈవెంట్‌కు హాజరైన సినా.. అందరని షాక్‌కు గురిచేశాలా తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెల్లడించాడు.
"ఈ రోజు నా డబ్ల్యూడబ్ల్యూఈ(WWE) రిటైర్మెంట్‌ను అధికారికంగా ప్రకటిస్తున్నాను. వచ్చే ఏడాది రెసల్ మేనియా అనంతరం నా కెరీర్‌కు విడ్కోలు పలకనున్నాను. మీ అభిమానానికి ధన్యవాదాలు" అని జాన్ సినా పేర్కొన్నాడు. ఇందుకు సంబంధించిన వీడియోను డబ్ల్యూడబ్ల్యూఈ సోషల్ మీడియాలో షేర్ చేసింది.
2001లో రెజ్లింగ్‌లోకి అరంగేట్రం చేసిన జాన్ సినా.. ఈ రెండు దశాబ్దాల కాలంలో కోట్ల మంది అభిమానులను తన సొంం చేసుకున్నాడు. ఇప్పటివరకు 16 సార్లు డబ్ల్యూడబ్ల్యూఈ ఛాంపియన్‌గా జాన్ సినా నిలిచాడు. జాన్ సినా కొన్ని హాలీవుడ్ సినిమాల్లో నటించి ఆకట్టుకున్నారు. టీవీ షోల్లోనూ సందడి చేశారు.
Comments
Please login to add a commentAdd a comment