అమెరికాలో కరీంనగర్ జిల్లా వాసి మృతి | Karim Nagar resident died in USA | Sakshi
Sakshi News home page

అమెరికాలో కరీంనగర్ జిల్లా వాసి మృతి

Published Sat, Jun 7 2014 4:41 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

అమెరికాలో కరీంనగర్ జిల్లా వాసి మృతి

అమెరికాలో కరీంనగర్ జిల్లా వాసి మృతి

చిగురుమామిడి, న్యూస్‌లైన్: కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం ముల్కనూర్‌కు చెందిన న్యాలకొండ అభినయ్‌రెడ్డి(22) అమెరికాలో ప్రమాదవశాత్తు మృతి చెందాడు. న్యాలకొండ శ్రీనివాస్‌రెడ్డి, విమల దంపతులకు అభినయ్‌రెడ్డితోపాటు ఓ కూతురు ఉంది. వీరి కుటుంబం 30 ఏళ్లుగా కరీంనగర్‌లోనే నివాసం ఉంటోంది. కరీంనగర్‌లో బీటెక్ పూర్తి చేసిన అభినయ్‌రెడ్డి ఎంఎస్ చదివేందుకు అమెరికా వెళ్లాడు. అక్కడ ఇండియానా రాష్ట్రంలోని తెహ్రాట్ అనే ప్రాంతంలో ఉంటున్నాడు. ఈ నెల 4న అక్కడ స్విమ్మింగ్‌పూల్‌లో ఈత కొడుతూ అస్వస్థతకు గురై కోమాలోకి వెళ్లాడు. ఈ నెల 5న ఉదయం 10 గంటల ప్రాంతంలో(భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటలకు) మరణించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement