'దేశాన్ని మారిస్తే నా వారసుడిని కాల్చిపారేయండి'
ఉత్తరకొరియా: దేశంలో తిరిగి సంస్కరణలు చేపట్టాలని ప్రయత్నిస్తే తన కుమారుడిని కాల్చిపారేయండని ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ తన అనుంగులకు, తనకు నమ్మకస్తులైన అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు. అందుకోసం వారందరికీ వెండితో తయారుచేసిన ప్రత్యేక తుపాకీలు ఇచ్చారు. ఉత్తర కొరియాలో కొత్తగా విడుదలైన పుస్తకాల్లో ఈ అంశాలు వెలుగుచూశాయి. ఉత్తర కొరియా పాలన మొత్తం కిమ్ ఇల్ సంగ్ కుటుంబం కిందే నడుస్తున్న విషయం తెలిసిందే.
జాంగ్ ఇల్ సంగ్ మరణాంతరం ఆ బాధ్యతలను కిమ్ జాంగ్ ఇల్ ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ దేశ పాలన చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విధానంలోనే దేశం ముందుకు వెళ్లాలని, కాదని తన మరణాంతరం సంస్కరణలు తీసుకొచ్చి దేశ పాలన విషయాల్లో మార్పులు చేసేందుకు తన వారసులు ప్రయత్నిస్తే కాల్చి పారేయండని చాలా గట్టిగా చెప్పినట్లు ఆ పుస్తకం తెలిపింది. రా జాంగ్ యిల్ అనే దక్షిణ కొరియా మాజీ నిఘా చీఫ్ ఆర్మీ అధికారి ఈ పుస్తకాన్ని రాశారు.
దీనిపైనే ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్పులుచేర్పులకు ప్రయత్నించి సోవియట్ యూనియన్ ఎంత పతనమైందో కిమ్ ఇల్ సంగ్ స్వయంగా చూశారని, ఈ నేపథ్యంలోనే తన అనంతరం వచ్చే వారసుడు దేశంలో స్టాలినేతర విధానాలు తీసుకురావాలని ప్రయత్నిస్తే దేశం విచ్ఛిన్నమయిపోతుందని భావించి అలా తన వారుసుడు ప్రయత్నిస్తే కాల్చి పారేయండి తన నమ్మకస్తులకు స్వయంగా తుపాకులు ఇచ్చినట్లు చెప్పారు.