Kim il-Sung
-
ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్‌కు ఏమైంది?
ప్యాంగ్యాంగ్ : ఉత్తర కొరియా సుప్రీం లీడర్ కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై ప్రపంచ వ్యాప్తంగా తీవ్ర చర్చజరుగుతోంది. ఉత్తర కొరియాలో వేడుకగా జరిపే తన తాత కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలకు కిమ్ జోంగ్ ఉన్ హాజరవ్వకపోవడమే ఇందుకు కారణం. ఉత్తర కొరియాకు తొలి అధ్యక్షుడిగా వ్యవహరించిన కిమ్ ఇల్ సంగ్ జయంతి ఉత్సవాలను ప్రతి ఏటా వేడుకగా జరుపుకుంటారు. ఆ రోజును జాతీయ సెలవుదినంగా ప్రకటించడమేకాకుండా, డే ఆఫ్ ది సన్‌గా వ్యవహరిస్తారు. కిమ్ ఇల్ సంగ్ 1948 నుంచి 1994లో మరణించే వరకు ఆయన ఉత్తర కొరియా ప్రీమియర్‌గా, అధ్యక్షుడిగా పనిచేశారు. ఆ తరువాత కిమ్ జోంగ్ ఉన్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్ అధ్యక్షుడు అయ్యారు. 2011లో కిమ్ జోంగ్ ఇల్ మరణానంతరం కిమ్ జోంగ్ ఉన్ ఉత్తర కొరియా పగ్గాలు అందుకున్నారు.(కిమ్ కీలక నిర్ణయం) కిమ్ ఇల్ సంగ్ జయంతి సందర్భంగా కుమ్సుసన్ ప్యాలెస్ ఆఫ్ సన్‌లో ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ఉత్తర కొరియా సీనియర్ అధికారులు నివాళులు అర్పించారు. అయితే ఎంతో ప్రాముఖ్యం ఉన్న ఈ కార్యక్రమానికి కిమ్ జోంగ్ ఉన్ హాజరుకాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. గతానికి భిన్నంగా తొలిసారి ఈ వేడుకల్లో కిమ్ జోంగ్ ఉన్ పాల్గొనకపోవడంతో మరోసారి ఆయన ఆరోగ్యంపై చర్చ ప్రారంభమైంది. ముఖ్యంగా చైన్ స్మోకింగ్ చేసే కిమ్ ఉబకాయంతో బాధపడుతున్నారు. కిమ్ తండ్రి కిమ్ జోంగ్ ఇల్, తాత కిమ్ ఇల్ సంగ్లు కూడా ఊభకాయులే. చైన్ స్మోకర్లు కూడా. ఆ ఇద్దరూ గుండెపోటుతోనే చనిపోయిన విషయం తెలిసిందే. దీంతో మరోసారి కిమ్ జోంగ్ ఉన్ ఆరోగ్య పరిస్థితిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. -
'దేశాన్ని మారిస్తే నా వారసుడిని కాల్చిపారేయండి'
ఉత్తరకొరియా: దేశంలో తిరిగి సంస్కరణలు చేపట్టాలని ప్రయత్నిస్తే తన కుమారుడిని కాల్చిపారేయండని ఉత్తర కొరియా వ్యవస్థాపకుడు కిమ్ ఇల్ సంగ్ తన అనుంగులకు, తనకు నమ్మకస్తులైన అధికారులకు ఆదేశాలు ఇచ్చాడు. అందుకోసం వారందరికీ వెండితో తయారుచేసిన ప్రత్యేక తుపాకీలు ఇచ్చారు. ఉత్తర కొరియాలో కొత్తగా విడుదలైన పుస్తకాల్లో ఈ అంశాలు వెలుగుచూశాయి. ఉత్తర కొరియా పాలన మొత్తం కిమ్ ఇల్ సంగ్ కుటుంబం కిందే నడుస్తున్న విషయం తెలిసిందే. జాంగ్ ఇల్ సంగ్ మరణాంతరం ఆ బాధ్యతలను కిమ్ జాంగ్ ఇల్ ప్రస్తుతం కిమ్ జాంగ్ ఉన్ దేశ పాలన చూస్తున్నారు. ప్రస్తుతం ఉన్న విధానంలోనే దేశం ముందుకు వెళ్లాలని, కాదని తన మరణాంతరం సంస్కరణలు తీసుకొచ్చి దేశ పాలన విషయాల్లో మార్పులు చేసేందుకు తన వారసులు ప్రయత్నిస్తే కాల్చి పారేయండని చాలా గట్టిగా చెప్పినట్లు ఆ పుస్తకం తెలిపింది. రా జాంగ్ యిల్ అనే దక్షిణ కొరియా మాజీ నిఘా చీఫ్ ఆర్మీ అధికారి ఈ పుస్తకాన్ని రాశారు. దీనిపైనే ఆయన మీడియాతో మాట్లాడుతూ మార్పులుచేర్పులకు ప్రయత్నించి సోవియట్ యూనియన్ ఎంత పతనమైందో కిమ్ ఇల్ సంగ్ స్వయంగా చూశారని, ఈ నేపథ్యంలోనే తన అనంతరం వచ్చే వారసుడు దేశంలో స్టాలినేతర విధానాలు తీసుకురావాలని ప్రయత్నిస్తే దేశం విచ్ఛిన్నమయిపోతుందని భావించి అలా తన వారుసుడు ప్రయత్నిస్తే కాల్చి పారేయండి తన నమ్మకస్తులకు స్వయంగా తుపాకులు ఇచ్చినట్లు చెప్పారు.