
లండన్: కాలుష్యానికి కారణమవున్న కార్లకు అడ్డుకట్ట వేసేందుకు బ్రిటన్ ప్రభుత్వం కొత్త పన్నును అమల్లోకి తెచ్చింది. లండన్ నగరంలో తిరిగే పాత కార్లు, అధిక కాలుష్యాన్ని వెదజల్లుతున్న వాహనాలకు 10 పౌండ్ల (రూ. 858) జరినామా విధించాలని లండన్ మేయర్ సాదిఖ్ ఖాన్ నిర్ణయించారు.
2006కు ముందు రిజిస్టరైన డీజి ల్, పెట్రోల్ వాహనాలకు ఈ కాలుష్య పన్ను వర్తిస్తుంది. ఈ నిర్ణయంతో పేద డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతారని పన్నును వ్యతిరేకిస్తున్న వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. యూరప్‌లో అత్యంత కాలుష్య నగరాల్లో ఒకటైన లండన్‌లో తక్షణం నివారణ చర్యలు చేపట్టాలని ఈ ఏడాది ఫిబ్రవరిలో యూరోపియన్ యూనియన్ హెచ్చరించింది.
Comments
Please login to add a commentAdd a comment