స్వర్గం... ఇక్కడే | magical island house that can only be reached by a 90ft-high suspension bridge | Sakshi
Sakshi News home page

స్వర్గం... ఇక్కడే

Published Fri, Apr 24 2015 9:51 AM | Last Updated on Sun, Sep 3 2017 12:45 AM

స్వర్గం... ఇక్కడే

స్వర్గం... ఇక్కడే

నడి సంద్రం.. చుట్టూ నీరు.. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్ని దీవి..!

నడి సంద్రం.. చుట్టూ నీరు.. ఆ ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్ని దీవి..! ప్రపంచంతో సంబంధమే లేకుండా దానిపై ఓ ఇల్లు.. అక్కడ ఏకాంతంగా గడిపితే.. ఆ హాయే వేరు కదా.. ప్రకృతి ప్రేమికులకు ఇంతకన్నా అద్భుతం మరొకటి ఉండదేమో! ఈ అద్భుతాన్ని చూడాలన్నా.. గడపాలన్నా చలో లండన్ అనాల్సిందే.. 90 మీటర్ల ఎత్తున్న ఈ భవనాన్ని చేరుకోవాలంటే పక్కనున్న కొండపై నుంచి ఉన్న 100 మీటర్ల పొడవుండే సన్నని బ్రిడ్జే ఆధారం.

ఇందులో ఉన్న గృహాలంకరణ, వసతులు చూస్తే ఓహో అనాల్సిందే..! ఫ్రెండ్స్‌తో కలసి సరదాగా గడిపేందుకు ఓ బార్, ఓ టీవీతో పాటు వైఫై సదుపాయం కూడా ఉంటుంది. ఇక్కడ హనీమూన్ చేసుకోవాలనుకునే జంటకు వారానికి రూ.28 వేలు చెల్లించాలి. ‘యునిక్ హోం స్టేస్’ సంస్థ ఇలాంటి ఎన్నో ప్యాకేజీలు కూడా ఇస్తోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement