శాన్ఫ్రాన్సిస్కో: భవిష్యత్ తరాలకు మెరుగైన వసతుల కల్పన కోసం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్ ఈ కంపెనీలోని తన వాటాలో 99 శాతం షేర్లను దానం చేయాలని నిర్ణయించడంపై ప్రశంసలతో పాటు విమర్శలూ వచ్చాయి. పన్నుల నుంచి మినహాయింపులు పొందేందుకు ఈ మార్గాన్ని ఎంచుకున్నారన్న విమర్శలపై జుకర్బర్గ్ స్పందించారు. విరాళంగా ఇవ్వడం ద్వారా తాను కాని, తన భార్య ప్రిసిల్లా చాన్ కాని ఎలాంటి పన్ను మినహాయింపులు పొందబోమని స్పష్టం చేశారు. తమ షేర్లను అమ్మినపుడు ఇతరుల మాదిరిగా పన్నులు చెల్లిస్తామని జుకర్బర్గ్ తన ఫేస్బుక్ పేజీలో పోస్ట్ చేశారు.
ఫేస్‌బుక్ మొత్తం విలువ 19.63 లక్షల కోట్లు కాగా ఇందులో జుకర్‌బర్గ్ వాటా 24 శాతం. ఇందులో 99 శాతం షేర్లను (దాదాపు రూ. 3 లక్షల కోట్లు) సమాజసేవకు వినియోగిస్తానని జుకర్‌బర్గ్ ప్రకటించిన విషయం తెలిసిందే. విద్య, మనుషుల శక్తి సామర్థ్యాలను పెంచేందుకు, వ్యాధులకు చికిత్స చేసేందుకు ఈ మొత్తాన్ని వినియోగించనున్నట్టు తెలిపారు.
'రూ. 3 లక్షల కోట్ల దానం.. అందుకోసం కాదు'
Published Fri, Dec 4 2015 4:08 PM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM
Advertisement
Advertisement