ఆల్కాహాల్‌ను ఎనర్జీ డ్రింక్‌తో తాగుతున్నారా?
ఆల్కాహాల్‌ను ఎనర్జీ డ్రింక్‌తో తాగుతున్నారా?
Published Wed, Mar 22 2017 1:02 PM | Last Updated on Tue, Sep 5 2017 6:48 AM
టొరంటో: మీరు ఆల్కాహాల్‌ను ఎనర్జీ డ్రింక్‌తో సేవిస్తున్నారా.. అయితే మీరు జాగ్రత్త పడాల్సిందే.. మద్యాన్ని ఎనర్జీ డ్రింక్‌తో తాగితే అత్యంత ప్రమాదకరమైన గాయాలు అవుతాయని ఓ సర్వేలో తెలిసింది. కెనడాకు చెందిన విక్టోరియా యూనివర్సిటీ జరిపిన పరిశోదనల్లో ఈ విషయం వెల్లడైంది. ఈ పరిశోధన వివరాలను ఆల్కాహాల్, డ్రగ్స్ క్లాసిఫైడ్ జర్నల్లో పేర్కొంది.
ఎనర్జీ డ్రింక్‌లో ఆల్కాహాల్ కలుపుకొని తాగితే రోడ్డు ప్రమాదాలు, గొడవలు జరిగేలా.. భౌతిక హింసకు పాల్పడే విధంగా ప్రేరేపిస్తుందని పరిశోధనలో వెల్లడైంది. అంతేకాకుండా ఇలా తాగినవారు విచక్షణా రహితంగా ప్రవర్తిస్తారని, ఇది అత్యంత ప్రమాదకరమని పరిశోదకులు హెచ్చరించారు. మాములుగా మధ్యం తాగిన వారు మత్తు ఎక్కువై ఇంటికి వెళ్తారు. కానీ ఎనర్జీ డ్రింక్‌తో తాగిన వారు ఇంకా ఎక్కువ మద్యం తీసుకుంటారని, వారికి మత్తు తెలియదని ప్రమాదకరకంగా ప్రవర్తిస్తారని పేర్కొన్నారు.
Advertisement
Advertisement