
మనీలా : ఏషియన్ సదస్సులో భాగంగా ఫిలిప్ఫైన్స్ మూడురోజుల పర్యటనలో ఉన్న భారత ప్రధాని నరేంద్ర మోదీ క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు. వరుసగా వివిధ దేశాల ప్రధానులతో ద్వైపాక్షిక ఒప్పందాలపై చర్చిస్తున్నారు.
భారత కాలమానం ప్రకారం మంగళవారం ఉదంయ ఆస్టేలియా ప్రధాని మాల్కోమ్ టర్న్‌బుల్, వియత్నం ప్రధాని గుయోన్ యువాన్ హుసి, ఆపై జపాన్ ప్రధాని షింబో అబేతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో ఆయా దేశాల ప్రతినిధులు కూడా హాజరయ్యారు. అనంతరం బ్రునై సుల్తాన్ హస్సనల్ బోల్కై తో కూడా సమావేశమై కీలక ఒప్పందాలు చేసుకున్నారు. నిన్న ఫిలిప్ఫైన్స్ అధ్యక్షుడు రొడ్రిగో డ్యుటెర్టె తో ఏకాంతంగా గడిపి పలు కీలక ఒప్పందాలపై చర్చించిన విషయం తెలిసిందే.
కాగా, నేడు అక్కడ నిర్వహించబోయే 12వ ఈస్ట్-ఏషియా సదస్సుతోపాటు, 15వ ఇండియా-ఏషియన్ సదస్సులో మోదీ పాల్గొననున్నారు.
Comments
Please login to add a commentAdd a comment