సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతకమైన కరోన వైరస్ బారిన పడి నలిగిపోతున్న ఇంగ్లండ్ మరోపక్క క్యాన్సర్ జబ్బుల విజృంభణతో అతలాకుతలం అవుతోంది. ఆస్పత్రులు, వైద్యులు కరోన వైరస్‌ను కట్టడి చేయడంపైనే ఎక్కువ దృష్టి పెట్టడం, అత్యవసరం లేదనుకున్న క్యాన్సర్ పేషేంట్లను చేర్చుకోవడానికి నిరాకరించడం వల్ల ఒక్కసారిగా ఇంగ్లండ్‌లో క్యాన్సర్ కేసులు పెరిగినట్లు వైద్య నిపుణులు భావిస్తున్నారు. ప్రస్తుతం క్యాన్సర్‌తో బాధ పడుతున్న వారితో సహా వచ్చే ఏడాది వరకల్లా దేశంలో 6,270 మంది క్యాన్సర్‌తో చనిపోతారని వారు అంచనా వేశారు.
(చదవండి : కరోనాపై పోరు.. భారత్‌కు భారీ రుణం)
దేశంలో ఇప్పటికే క్యాన్సర్‌తో బాధ పడుతున్న వారి సంఖ్య దాదాపు 18 వేలకు చేరిందని వీరిలో చాలా మంది మృత్యువాత పడే అవకాశం ఉందని, ఈ సంఖ్య కరోనా మృతుల సంఖ్యను దాటేపోయే ప్రమాదం కూడా ఉందని వైద్య నిపుణులు హెచ్చరించారు. ఇంతవరకు కరోనా వైరస్ బారిన పడి 21 వేల మంది మరణించిన విషయం తెల్సిందే. కోవిడ్ రోగులను ఆస్పత్రుల్లో చేర్చుకోవడం బాగా పెరిగినందున క్యాన్సర్ రోగులను బుధవారం నుంచి ఆస్పత్రుల్లో చేర్చుకునేందుకు అనుమతిచ్చినట్లు ఇంగ్లండ్ ఆరోగ్య శాఖ మంత్రి మట్ హాన్‌కాక్ తెలిపారు.
వివిధ ఆస్పత్రులతో సహా తాత్కాలిక నైటింగేల్ బెడ్లను కూడా ఇప్పటి వరకు కరోనా వైరస్ బాధితుల కోసమే కేటాయించారు. ఈ కారణంగానే క్యాన్సర్ రోగులకు బెడ్లు కరువయ్యాయి. ఎన్‌హెచ్‌ఎస్‌లో సభ్యులైన ప్రతి వెయ్యి మందిలో పది శాతం మందికి కరోనా కారణంగా వైద్యం అందలేదని, ఆ కారణంగా క్యాన్సర్ మృతుల సంఖ్య పెరగి ఉండవచ్చని ఎన్‌హెచ్‌ఎస్ అధికారులు తెలిపారు.
ఇటు కరోనా, అటు క్యాన్సర్ చావులు
Published Wed, Apr 29 2020 2:20 PM | Last Updated on Wed, Apr 29 2020 7:08 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment