ఈ ప్రపంచం రోగగ్రస్తం! | More than 95% of the world has health problems, says study | Sakshi
Sakshi News home page

ఈ ప్రపంచం రోగగ్రస్తం!

Published Tue, Jun 9 2015 2:35 AM | Last Updated on Sun, Sep 3 2017 3:26 AM

ఈ ప్రపంచం రోగగ్రస్తం!

ఈ ప్రపంచం రోగగ్రస్తం!

95 శాతం మందికి  ఏదో ఒక ఆరోగ్య సమస్య  
* మూడో వంతు మందికి ఐదు కంటే ఎక్కువ వ్యాధులు
* అంతర్జాతీయ పరిశోధనలో వెల్లడి

వాషింగ్టన్: ప్రపంచ జనాభాలో ఏకంగా 95 శాతం మంది ప్రజలు రోగగ్రస్తులే! దాదాపు మూడొంతుల మందికి ఐదు కన్నా ఎక్కువ అనారోగ్య సమస్యలు ఉన్నాయి. ప్రతి ఇరవై మందిలో ఒక్కరు మాత్రమే ఆరోగ్యవంతులు ఉన్నారు.1990-2013 సంవత్సరాల మధ్య కాలంలో ఆరోగ్య పరిస్థితులపై ‘గ్లోబల్ బర్డెన్ ఆఫ్ డిసీజ్ స్టడీ(జీబీడీ)’ పేరుతో జరిగిన అధ్యయనంలో ఈ వివరాలు వెల్లడయ్యాయి.

ఈ సర్వే ఫలితాలు తాజాగా అంతర్జాతీయ మెడికల్ జర్నల్ ‘ద లాన్సెట్’లో ప్రచురితమయ్యాయి. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యుయేషన్ పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. 188 దేశాల నుంచి 35,620 వనరుల నుంచి సమాచారం సేకరించి పరిశోధించారు.
 
సర్వేలోని ముఖ్యాంశాలు...
2013 నాటికి ఎలాంటి ఆరోగ్య సమస్యలు లేనివారు ప్రపంచవ్యాప్తంగా ప్రతి 20 మందిలో ఒకరు (4.3 శాతం) మాత్రమే ఉన్నారు.
ప్రపంచ జనాభాలో మూడొంతుల మంది (230 కోట్లు) ఐదు కన్నా ఎక్కువ అనారోగ్యాలతో బాధపడుతున్నారు. పది ఆరోగ్య సమస్యలు ఉన్నవారి సంఖ్య 1990-2013 మధ్యలో ఏకంగా 52 శాతం పెరిగింది.
1990, 2013లో నడుం నొప్పి, కుంగుబాటు, రక్తహీనత, మెడ నొప్పి, వయసు సంబంధ వినికిడిలోపం వంటి సమస్యలే ఆరోగ్య నష్టాలకు అత్యధికంగా కారణమయ్యాయి.
⇒  2013లో ప్రపంచ ఆరోగ్య నష్టాలకు ముఖ్యంగా నడుంనొప్పి, కీళ్లనొప్పి, కుంగుబాటు, ఆందోళన, డ్రగ్స్, ఆల్కహాల్ సంబంధిత అనారోగ్యాలే అధికంగా కారణమయ్యాయి.
ప్రపంచవ్యాప్తంగా అనారోగ్య సమస్యల వల్ల ప్రజలు తమ జీవితాల్లో నష్టపోయిన ఆరోగ్యకర సంవత్సరాలు 1990లో 21 శాతం కాగా, అది 2013 నాటికి 31 శాతానికి పెరిగింది.
1990తో పోల్చితే 2013 నాటికి మరణాల రేటు కంటే అంగ వైకల్య రేటు చాలా నెమ్మదిగా తగ్గుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement