‘ఆటమ్’తో సముద్ర వాతావరణం సర్వే! | NASA probe to explore global atmosphere over oceans | Sakshi
Sakshi News home page

‘ఆటమ్’తో సముద్ర వాతావరణం సర్వే!

Published Sat, Jul 9 2016 8:19 PM | Last Updated on Mon, Sep 4 2017 4:29 AM

‘ఆటమ్’తో సముద్ర వాతావరణం సర్వే!

‘ఆటమ్’తో సముద్ర వాతావరణం సర్వే!

వాషింగ్టన్: భూమి మీద ఉన్న మారుమూల ప్రాంతాల్లో కాలుష్య స్థాయిని గుర్తించి, తద్వారా వాతావరణం ఎంతగా మారుతుందో అంచనా వేయడానికి వీలుగా భూ వాతావరణ ఆకృతులను మ్యాపింగ్ చేయడం కోసం నాసా ఒక వైమానిక మిషన్‌ను ప్రారంభించింది. వాతావరణంలో మసి, హైడ్రోకార్బన్లు, నైట్రోజెన్ ఆక్సైడ్‌లు పూర్తిగా విస్తరించి కాలుష్యాన్ని పెంపొందిస్తున్నాయి.

అయితే ఖండాల సమీపంలో ఉండే ప్రాంతాల్లో కంటే మారుమూల ప్రాంతాల్లో వాతావరణం 1000కి పైగాకారకాలతో పరిశుభ్రంగా ఉందని పరిశోధకులు చెబుతున్నారు. అందువల్ల మొదటగా సముద్రాల్లో వాతావరణం ఎలా ఉందో అట్మాస్పియర్ టోమోగ్రఫీ మిషన్(ఆటమ్) ద్వారా సర్వే చేయనున్నారు. ఇందుకోసం నాసా శాస్త్రవేత్తలు ‘కదిలే డీసీ-8 ల్యాబొరేటరీ’ సహాయంతో ఉత్తర దక్షిణ ధృవం నుంచి పసిఫిక్ సముద్రం మీదుగా న్యూజేలాండ్ వరకు, ఆ తర్వాత దక్షిణ అమెరికా తీర ప్రాంతం, ఉత్తరాన అట్లాంటిక్ మహాసముద్రం నుంచి గ్రీన్‌లాండ్ వరకు ప్రయాణించనున్నారు.

‘మేము ఇప్పటికే భూమి మీద ఉన్న చాలా ప్రాంతాల్లోని వాతావరణాన్ని గుర్తించాము. చాలా ప్రాంతాల్లో కాలుష్య కారకాలు విడుదల అవుతున్నాయి. అయితే గ్రహంలో నేల ఉన్న ప్రాంతం చాలా స్వల్పం. సముద్రాల్లో చాలా రసాయన ప్రతిచర్యలు జరుగుతున్నాయి. వీటిలో చాలా ప్రాంతాలు చాలా మారుమూల ఉండడంతో వీటిని అర్థం చేసుకోవడం కష్టంగా ఉంది. ఈ ఆటమ్ ప్రాజెక్టు ద్వారా మేము చాలా మారుమూల ఉన్న ప్రాంతాలకు వెళ్లి అక్కడి రసాయనిక మార్పులను కొలవనున్నాం’ అని వాతావరణ శాస్త్రవేత్త, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఇర్విన్ ఆటమ్స్ డిప్యూటీ ప్రాజెక్టు శాస్త్రవేత్త మైఖెల్ ప్రథెర్ తెలిపారు. ఆటమ్స్ మొదటి ప్రయాణం జూలై 31న ప్రారంభమై 26 రోజుల్లో ప్రపంచాన్ని చుట్టేయనుంది. వివిధ సీజన్లలో వచ్చే మూడు సంవత్సరాలపాటు ఈ పర్యటన కొనసాగనుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement