కేప్ కనావరెల్: అంతరిక్ష పరిశోధకులు, ఔత్సాహికులను పలకరించేందుకు వినీలాకాశంలో కొత్త అతిథి వచ్చింది. దాదాపు 460 కోట్ల ఏళ్లక్రితంనాటి దుమ్ము, ధూళితో నిండినఈ ‘నియోవైస్’ తోకచుక్క భూమి ఉత్తరధృవప్రాంతంలో ఆకాశంలో కనువిందుచేస్తోంది. ఈ తోకచుక్కను మార్చి నెలలో నాసాకు చెందిన నియోవైస్ ఇన్‌ఫ్రారెడ్ స్పేస్ టెలిస్కోప్ గుర్తించింది. దాదాపు ఐదు కిలోమీటర్ల పొడవైన ఈ తోకచుక్క ఆగస్ట్ 15వ తేదీదాకా మనకు కనిపించి ఆ తర్వాత మన సౌరకుటుంబం నుంచి సుదూరతీరాలకు వెళ్లనుంది. 1990ల తర్వాత ఉత్తరధృవంలో ఇంతటి కాంతివంతమైన తోకచుక్క కనిపించడం ఇదే తొలిసారికావడం విశేషం. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని వ్యోమగాములు ఇప్పటికే దీని అందమైన ఫొటోలను కెమెరాల్లో బంధించారు.
Comments
Please login to add a commentAdd a comment