నాసా అతిపెద్ద టెలిస్కోప్!
వాషింగ్టన్: అతిపెద్ద అంతరిక్ష టెలిస్కోప్‌ను అమెరికా అంతరిక్ష సంస్థ నాసా విజయవంతంగా రూపొందించింది. హబుల్ టెలిస్కోప్ కంటే వంద రెట్లు శక్తిమంతమైన ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్’ను అభివృద్ధి చేసినట్లు పరిశోధ కులు వెల్లడించారు. ఈ అత్యాధునిక టెలిస్కోప్‌ను నాసా, యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ, కెనడా ఏజెన్సీలు సంయుక్తంగా నిర్మించాయి. 26 ఏళ్లుగా హబుల్ టెలిస్కోప్ సేవలందిస్తోందని, జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌ను దాని తర్వాత తరానికి చెందినదిగా నాసా పేర్కొంది.
ఇందులో ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్లతో సున్నితమైన కెమెరాలను పొందుపరిచారు. ఈ కెమెరాలకు సూర్య కిరణాలు నేరుగా తగలకుండా ఉండేందుకు రక్షణగా ఐదు లేయర్లను ఏర్పరిచారు. ఇవి మానవుని వెంట్రుకల కంటే పలుచగా ఉంటాయి. ఈ టెలిస్కోప్ విశ్వం తొలినాళ్లలో ఏర్పడిన మొదటి నక్షత్ర మండలాల ఫొటోలను సైతం అందించగలదని నాసాకు చెందిన కెస్కి కుహా చెప్పారు.