బేషరతుగా భారత్‌తో చర్చలకు సిద్ధం: షరీఫ్ | Nawaz Sharif Ready for Talks With India Without Preconditions: Reports | Sakshi
Sakshi News home page

బేషరతుగా భారత్‌తో చర్చలకు సిద్ధం: షరీఫ్

Published Sat, Nov 28 2015 7:29 PM | Last Updated on Sun, Sep 3 2017 1:10 PM

Nawaz Sharif Ready for Talks With India Without Preconditions: Reports

వాలెట్టా (మాల్టా): సుస్థిరమైన శాంతి కోసం బేషరతుగా భారత్‌తో చర్చలు జరిపేందుకు తాను సిద్ధంగా ఉన్నానని పాకిస్థాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ పేర్కొన్నారు. భారత్‌, అఫ్గానిస్థాన్‌ సహా అన్ని పొరుగుదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు కలిగి ఉండాలని పాకిస్థాన్ భావిస్తున్నదని ఆయన చెప్పారు. ఈ మేరకు ఆయన పేర్కొన్నట్టు జీయో న్యూస్ తెలిపింది.

మాల్టా రాజధాని వాలెట్టాలో జరిగిన కామన్‌వెల్త్ ప్రభుత్వాధిపతుల సదస్సు సందర్భంగా బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరాన్‌తో సమావేశంలో షరీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారని పేర్కొంది. ఈ సందర్భంగా ఇరుదేశాలు వాణిజ్యం, పెట్టుబడులు, భద్రత తదితర రంగాల్లో పరస్పర సహకారాన్ని కొనసాగించాలని కామెరాన్‌, షరీఫ్ నిర్ణయించినట్టు జీయో న్యూస్ తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement