కొత్త గ్రహం పుట్టింది..!! | New Planet Born From Gas And Dust | Sakshi
Sakshi News home page

కొత్త గ్రహం పుట్టింది..!!

Published Tue, Jul 3 2018 3:53 PM | Last Updated on Tue, Jul 3 2018 5:52 PM

New Planet Born From Gas And Dust - Sakshi

కొత్త గ్రహం పీడీఎస్‌-70

బెర్లిన్ : అప్పుడే జన్మించిన కొత్త గ్రహా ఫొటోను యూరోపియన్‌ సదర్న్‌ అడ్జర్వేటరీ విడుదల చేసింది. కొన్ని యువ నక్షత్రాల నుంచి వెలువడిన వాయువులు, దుమ్ముధూలి కణాలతో ఈ గ్రహం ఏర్పడినట్లు జర్మనీలోని హీడెల్‌ బర్గ్‌లో గల మాక్స్‌ప్లాంక్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రానమీ పరిశోధకులు వెల్లడించారు.

సుదూరంలో ఉన్న గ్రహాల ఫొటోలను తీయగలిగే అతి పెద్ద టెలిస్కోప్ అయిన స్పియర్ (స్పెక్ట్రో-పొలరీమెట్రిక్‌ హై కాంట్రాస్ట్‌ ఎక్సోప్లానెట్‌ రిసెర్చ్‌)ను ఉపయోగించి భూమికి 370 కాంతి సంవత్సరాల దూరంలో ఉన్న ఈ కొత్త గ్రహం ఫొటోను తీయగలిగారు.

ఈ గ్రహానికి పీడీఎస్‌ 70 అని నామకరణం చేశారు. సౌరవ్యవస్థలోనే అత్యధిక వేడి ఈ గ్రహంపై ఉన్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. ఈ గ్రహాన్ని గురించి మరిన్ని వివరాలు సేకరించే పరిశోధనలు జరుగుతున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement