ఉత్కంఠకు తెరదించిన కిమ్ | North Korean first lady reappears in media after nine months of absence | Sakshi
Sakshi News home page

ఉత్కంఠకు తెరదించిన కిమ్

Published Sun, Dec 4 2016 1:17 PM | Last Updated on Mon, Sep 4 2017 9:54 PM

ఉత్కంఠకు తెరదించిన కిమ్

ఉత్కంఠకు తెరదించిన కిమ్

సియోల్‌: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భార్య రీ సోల్ జు అదృశ్యంపై ఉత్కంఠకు తెర పడింది. తొమ్మిది నెలల తర్వాత రీ సోల్ జు బయట కనిపించారు. ఉత్తర కొరియా సైనిక విన్యాసాలకు తిలకించేందుకు కిమ్ కలిసి ఆమె వచ్చారని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగిందనేది తెలపలేదు. మార్చి 28 తర్వాత రీ సోల్ జు ప్రజల ముందుకు రావడం ఇదే తొలిసారి. ప్యాంగాంగ్ లో దుకాణ సముదాయం ప్రారంభోత్సవానికి అప్పట్లో ఆమె హాజరయ్యారు.

అయితే రీ సోల్ జు కొన్నినెలల పాటు కనిపించకపోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నాలుగు నెలల పాటు ఆమె బయటకు రాకపోవడంతో పలు వదంతులు వ్యాపించాయి. రీ సోల్ జును కిమ్‌ చంపించేశాడేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. 2011, డిసెంబర్‌ లో అధికారంలోకి వచ్చిన కిమ్ జోంగ్ ఉన్.. 2012లో తొలిసారి రీ సోల్ జుతో జతగా కనిపించారు. అయితే కిమ్ పెళ్లి ఎప్పుడైందనే విషయంపైనా అక్కడి ప్రజలకు, అధికారులకు స్పష్టత లేదు. 2013లో రీ ఆడబిడ్డకు జన్మనిచ్చిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement