Ri Sol-ju
-
ఆమె బతికే ఉంది.. ఇదిగో సాక్ష్యం
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ పాలనలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ఎప్పుడు ఎవరు తెర మీదకు వస్తారో.. ఎవరు కనుమరుగవుతారో చెప్పడం చాలా కష్టం. స్వయంగా అధినేత కిమ్ జాంగ్ ఉన్నే చాలా రోజుల పాటు కనమరుగయ్యారు. దాంతో ఆయన చనిపోయాడని.. ఇక బాధ్యతలు కిమ్ సోదరి చేతిలోకి వెళ్తాయని ఊహాగానాలు వినిపించాయి. వీటన్నింటిని పటాపంచలు చేస్తూ.. కొన్ని రోజుల క్రితం కిమ్ తెరమీదకు వచ్చారు. ఇదిలా ఉండగా కిమ్ భార్య కనిపించి ఏడాది పైనే అవుతోంది. ప్రసుత్తం ఆమె గర్భవతిగా ఉంది అందుకే కనిపించడం లేదనే వార్తలు కొన్ని రోజులు షికారు చేశాయి. ఏడాది కాలం పూర్తయిన ఆమె బహిరంగంగా కనిపించకపోవడంతో.. ఇక ఆమె చనిపోయి ఉంటుంది.. లేదా చంపేశారనే వార్తలు ప్రచారం అవుతున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా కిమ్ భార్య రి సోల్ జు మంగళవారం తన భర్తతో కలిసి కనిపించారు. తన మామ కిమ్ జోంగ్ ఇల్ జయంతి వేడుకల సందర్భంగా ఏర్పాటు చేసిన కన్సర్ట్కి ఆమె తన భర్త కిమ్ జాంగ్ ఉన్‌తో కలిసి హాజరయ్యారు. రి సోల్ జు ఇలా పబ్లిక్‌గా దర్శనమిచ్చి దాదాపు ఏడాది పైనే అవుతోంది. గతేడాది జనవరిలో కనిపించిన రి సోల్ జు మళ్లీ ఇప్పుడే దర్శనమిచ్చారు. ప్యోంగ్యాంగ్లో ఏర్పాటు చేసిన మామ జయంతి కార్యక్రమంలో భర్తతో కలిసి హాజరైన రి సోల్ జు.. కన్సర్ట్ను వీక్షించి.. ప్రదర్శనకారులను ప్రశంసించారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు నార్త్ కొరియా అధికారిక న్యూస్ పేపర్లో ప్రచురితం అయ్యాయి. కింగ్ జోంగ్ ఇల్ జయంతిని ఉత్తర కొరియా ప్రభుత్వం జాతీయ సెలవు దినంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. దక్షిణ కొరియా నేషనల్ ఇంటిలిజెన్స్ సర్వీస్ అధికారి ఒకరు రి సోల్ జు క్షేమంగానే ఉన్నారని.. తన పిల్లలతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారని తెలిపారు. కరోనా కాలం కావడంతో పబ్లిక్ మీటింగ్‌లకు హాజరు కావడం లేదన్నారు. ఈ ప్రకటన వెలువడిన మరుసటి రోజే కిమ్ భార్య పబ్లిక్‌గా దర్శనమిచ్చి.. అన్ని అనుమానాలను పటాపంచలు చేశారు. ఇదిలా ఉంటే, ఉత్తర కొరియా అధ్యక్షులను చైర్మన్ అని పిలుస్తుంటారు. నార్త్ కొరియా దేశానికి మొదటి అధ్యక్షుడిగా పనిచేసిన కిమ్ సంగ్‌ని మాత్రమే ప్రెసిడెంట్ అని పిలిచేవారు. ఆ తరువాత పనిచేసిన అధ్యక్షులను చైర్మన్ అని పిలిచారు. అయితే, ప్రస్తుత చైర్మన్ కిమ్ జోంగ్ ఉన్ను ఆ దేశ మీడియా మొదటిసారి ప్రెసిడెంట్ అని సంభోదించింది. ఇక ఉత్తర కొరియా మీడియా ఏజెన్సీ కూడా ఇదే విధంగా సంభోదించడం విశేషం. చదవండి: ఒక్కసారిగా ఏడ్చేసిన కిమ్ నెల రోజులుగా కనిపించని కిమ్ సోదరి?! -
సతీ సమేతంగా..
ప్యాంగ్యాంగ్ : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కాసేపు అమెరికాకు రెస్ట్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన కాస్మటిక్ ఫ్యాక్టరీని భార్య రీ సోల్ జూతో కలసి కిమ్ సందర్శించినట్లు రిపోర్టులు వస్తున్నాయి. 14 ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీని కిమ్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ సందర్శించారు. ఉత్తరకొరియాను ఎన్నటికీ అణు సంపత్తి కలిగిన దేశంగా గుర్తించబోమని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్ దక్షిణ కొరియా పర్యటనలో పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపటికే భార్య, తన సీనియర్ అధికారులతో కలసి కిమ్ కాస్మటిక్ ఫ్యాక్టరీని సందర్శించినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా ఓ ప్రకటన విడుదల చేసింది. గడచిన కొద్ది నెలలుగా ఉత్తరకొరియా, అమెరికా పరస్పర అణు దాడి హెచ్చరికలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సాధారణంగా మిస్సైల్స్, ఆయుధాలతో ఫొటోల్లో కనిపించే కిమ్.. ఈ సారి మాత్రం సబ్బులతో, రకరకాల సౌందర్య సాధానాలతో కనిపించారు. -
ఉత్కంఠకు తెరదించిన కిమ్
సియోల్: ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ భార్య రీ సోల్ జు అదృశ్యంపై ఉత్కంఠకు తెర పడింది. తొమ్మిది నెలల తర్వాత రీ సోల్ జు బయట కనిపించారు. ఉత్తర కొరియా సైనిక విన్యాసాలకు తిలకించేందుకు కిమ్ కలిసి ఆమె వచ్చారని స్థానిక మీడియా వెల్లడించింది. అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు జరిగిందనేది తెలపలేదు. మార్చి 28 తర్వాత రీ సోల్ జు ప్రజల ముందుకు రావడం ఇదే తొలిసారి. ప్యాంగాంగ్ లో దుకాణ సముదాయం ప్రారంభోత్సవానికి అప్పట్లో ఆమె హాజరయ్యారు. అయితే రీ సోల్ జు కొన్నినెలల పాటు కనిపించకపోవడం ఇదే మొదటిసారి కాదు. గతేడాది నాలుగు నెలల పాటు ఆమె బయటకు రాకపోవడంతో పలు వదంతులు వ్యాపించాయి. రీ సోల్ జును కిమ్ చంపించేశాడేమోనన్న అనుమానాలు కూడా వ్యక్తమయ్యాయి. 2011, డిసెంబర్ లో అధికారంలోకి వచ్చిన కిమ్ జోంగ్ ఉన్.. 2012లో తొలిసారి రీ సోల్ జుతో జతగా కనిపించారు. అయితే కిమ్ పెళ్లి ఎప్పుడైందనే విషయంపైనా అక్కడి ప్రజలకు, అధికారులకు స్పష్టత లేదు. 2013లో రీ ఆడబిడ్డకు జన్మనిచ్చిచ్చారు. -
కిమ్ భార్య అదృశ్యంపై అనుమానాలు
-
కిమ్ భార్య అదృశ్యంపై అనుమానాలు
ప్యాంగాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భార్య రీ సోల్ జు ఏడు నెలలుగా కనిపించటం లేదు. 2012లో తొలిసారి నియంతతో జతగా కనిపించిన రీ.. అప్పటినుంచి 22 సార్లు మాత్రమే బయట (బహిరంగంగా) కొచ్చారు. అయితే కిమ్ పెళ్లి ఎప్పుడైందనే విషయంపైనా అక్కడి ప్రజలకు, అధికారులకు స్పష్టత లేదు. అయితే చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో రీ కనిపించారు. ఆ తర్వాత ఆమె గురించిన వివరాలేవీ బయటకు రాలేదు. దీనిపై భిన్నకథనాలు వినబడుతున్నాయి. రీ గర్భవతి అయ్యుండొచ్చని అందుకే విశ్రాంతి కారణంగా బయటకు రావటం లేదని కొందరు భావిస్తున్నారు. 2013లో రీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. అయితే వారసుడు కావాలని కిమ్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దేశానికి సంబంధించి శుభవార్త(వారసుడు) అందించేందుకే సస్పెన్స్ కొనసాగిస్తున్నారని సన్నిహితులు భావిస్తున్నారు. మరోవైపు, ఉత్తరకొరియాలో అస్థిరత కనిపిస్తున్నందున కిమ్ తన భార్యను పటిష్టమైన భద్రతలో ఉంచారని టోక్యో ప్రొఫెసర్ ఒకరు తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తై.. తనకు వ్యతిరేకంగా జరిగే ఏ చిన్న ప నినీ సహించని కిమ్.. వారిని నిర్దాక్షిణ్యంగా చంపించేసాతరు. ఒకవేళ రీ అలాంటి పనేమైనా చేస్తే కిమ్ చంపించేసి ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.