కిమ్ భార్య అదృశ్యంపై అనుమానాలు
ప్యాంగాంగ్: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ భార్య రీ సోల్ జు ఏడు నెలలుగా కనిపించటం లేదు. 2012లో తొలిసారి నియంతతో జతగా కనిపించిన రీ.. అప్పటినుంచి 22 సార్లు మాత్రమే బయట (బహిరంగంగా) కొచ్చారు. అయితే కిమ్ పెళ్లి ఎప్పుడైందనే విషయంపైనా అక్కడి ప్రజలకు, అధికారులకు స్పష్టత లేదు. అయితే చివరిసారిగా ఈ ఏడాది మార్చిలో ఓ ప్రైవేటు కార్యక్రమంలో రీ కనిపించారు. ఆ తర్వాత ఆమె గురించిన వివరాలేవీ బయటకు రాలేదు. దీనిపై భిన్నకథనాలు వినబడుతున్నాయి. రీ గర్భవతి అయ్యుండొచ్చని అందుకే విశ్రాంతి కారణంగా బయటకు రావటం లేదని కొందరు భావిస్తున్నారు. 2013లో రీ ఆడబిడ్డకు జన్మనిచ్చింది.
అయితే వారసుడు కావాలని కిమ్ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే దేశానికి సంబంధించి శుభవార్త(వారసుడు) అందించేందుకే సస్పెన్స్ కొనసాగిస్తున్నారని సన్నిహితులు భావిస్తున్నారు. మరోవైపు, ఉత్తరకొరియాలో అస్థిరత కనిపిస్తున్నందున కిమ్ తన భార్యను పటిష్టమైన భద్రతలో ఉంచారని టోక్యో ప్రొఫెసర్ ఒకరు తెలిపారు. ఇవన్నీ ఒక ఎత్తై.. తనకు వ్యతిరేకంగా జరిగే ఏ చిన్న ప నినీ సహించని కిమ్.. వారిని నిర్దాక్షిణ్యంగా చంపించేసాతరు. ఒకవేళ రీ అలాంటి పనేమైనా చేస్తే కిమ్ చంపించేసి ఉండొచ్చనే అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.