ప్యాంగ్‌యాంగ్ : ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కాసేపు అమెరికాకు రెస్ట్ ఇచ్చినట్లు కనిపిస్తున్నారు. దేశ రాజధానిలో కొత్తగా నిర్మించిన కాస్మటిక్ ఫ్యాక్టరీని భార్య రీ సోల్ జూతో కలసి కిమ్ సందర్శించినట్లు రిపోర్టులు వస్తున్నాయి. 14 ఏళ్ల క్రితం ఈ ఫ్యాక్టరీని కిమ్ తండ్రి కిమ్ జాంగ్ ఇల్ సందర్శించారు.
ఉత్తరకొరియాను ఎన్నటికీ అణు సంపత్తి కలిగిన దేశంగా గుర్తించబోమని అమెరికా రక్షణ శాఖ కార్యదర్శి జిమ్ మాటిస్ దక్షిణ కొరియా పర్యటనలో పేర్కొన్నారు. అనంతరం కొద్దిసేపటికే భార్య, తన సీనియర్ అధికారులతో కలసి కిమ్ కాస్మటిక్ ఫ్యాక్టరీని సందర్శించినట్లు ఉత్తరకొరియా అధికారిక మీడియా ఓ ప్రకటన విడుదల చేసింది.
గడచిన కొద్ది నెలలుగా ఉత్తరకొరియా, అమెరికా పరస్పర అణు దాడి హెచ్చరికలు చేసుకుంటున్న విషయం తెలిసిందే. సాధారణంగా మిస్సైల్స్, ఆయుధాలతో ఫొటోల్లో కనిపించే కిమ్.. ఈ సారి మాత్రం సబ్బులతో, రకరకాల సౌందర్య సాధానాలతో కనిపించారు.
Comments
Please login to add a commentAdd a comment