‘ట్రంప్‌తో నేను మాట్లాడాను.. ఒప్పుకున్నారు’ | Not Sure How Many Refugees US Will Accept: Australian PM | Sakshi
Sakshi News home page

‘ట్రంప్‌తో నేను మాట్లాడాను.. ఒప్పుకున్నారు’

Published Wed, Feb 1 2017 3:49 PM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

‘ట్రంప్‌తో నేను మాట్లాడాను.. ఒప్పుకున్నారు’ - Sakshi

‘ట్రంప్‌తో నేను మాట్లాడాను.. ఒప్పుకున్నారు’

కాన్బెర్రా: ఎంతమంది శరణార్థులకు అమెరికా ఆశ్రయం ఇస్తుందనే విషయం, అంగీకరిస్తుందనే సమాచారం ఇప్పుడే తెలియదని ఆస్ట్రేలియా ప్రధాని మాల్కోమ్‌ టర్న్‌బుల్‌ అన్నారు. ప్రస్తుతం పసిఫిక్‌ ఐలాండ్‌లోని క్యాంపుల్లో చాలామంది శరణార్థులు ఉన్నారని, వారిలో ట్రంప్‌ పాలన వర్గం ఎంతమందికి అవకాశం ఇస్తుందని తెలియదన్నారు.

బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ తాను ఈ వారాంతంలో ట్రంప్‌తో ఫోన్లో మాట్లాడానని, ఒబామా పరిపాలన వర్గం గతంలో శరణార్థులకు ఆశ్రయం ఇచ్చేందుకు అంగీకరించిందని, దానికి కట్టుబడి ఉండాలనే విషయం తాను ట్రంప్తో చెప్పానని, అందుకు ఆయన కూడా ఒప్పుకున్నారని, అయితే, ఎంతమందికనే విషయంలో స్పష్టతనివ్వలేదని చెప్పారు.

అక్కడ ఉన్న శరణార్ధుల్లో ముస్లింలే ఎక్కువగా ఉన్నారని ఆయన గుర్తు చేశారు. మరోపక్క, శ్వేత సౌదం అధికార ప్రతినిధి ఈ విషయంపై స్పందిస్తూ దేశంలో ఉన్న శరణార్థులను మరోసారి తనిఖీలు చేస్తామని, కొత్తగా అనుమతిచ్చేవారికి అత్యంత కఠినమైన నిబంధనల మధ్య వెరిఫికేషన్‌ ఉంటుందని, అమెరికాకు ఉగ్రదాడి నుంచి ముప్పు ఉన్నందునే ఈ పనిచేస్తామని స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement