కరాచీ: అమెరికా పర్యటనకు రావాల్సిందిగా ఆ దేశాధ్యక్షుడు బరాక్ ఒబామా.. భారత్, పాకిస్తాన్ ప్రధాన మంత్రులు నరేంద్ర మోదీ, నవాజ్ షరీఫ్లను ఆహ్వానించారు. వచ్చే మార్చి చివర్లో వాషింగ్టన్లో జరిగే అణుభద్రత సదస్సులో పాల్గొనాల్సిందిగా ఒబామా వీరిద్దరినీ కోరినట్టు పాక్ పత్రిక వెల్లడించింది. 2016 మార్చి చివర్లో అణుభద్రత నాలుగో సదస్సు నిర్వహించనున్నట్టు గత 2004 సదస్సు సందర్భంగా ఒబామా ప్రకటన చేశారు.
వాషింగ్టన్ సదస్సు సందర్భంగా మోదీ, షరీఫ్ సమావేశంకానున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. నవాజ్ షరీఫ్ పుట్టినరోజు సందర్భంగా నరేంద్ర మోదీ ఆకస్మికంగా లాహోర్ వెళ్లి పాక్ ప్రధానికి శుభాకాంక్షలు తెలపడంతో పాటు ఆయన మనవరాలి వివాహంలో పాల్గొని వచ్చిన సంగతి తెలిసిందే. వాషింగ్టన్ సదస్సులో ఇరు దేశాల ప్రధానులు మరోసారి సమావేశమైతే భారత్, పాక్ సంబంధాలు మెరుగుపడగలవని భావిస్తున్నారు.
మోదీ, షరీఫ్లకు ఒబామా ఆహ్వానం
Published Tue, Dec 29 2015 2:49 PM | Last Updated on Wed, Aug 15 2018 2:20 PM
Advertisement
Advertisement