
ఐదున్నర లక్షలమందిపై లైంగిక వేధింపులు!
లండన్: పేద దేశాల్లోనే కాదు.. ఇప్పటికే అభివృద్ధి చెందిన దేశాల్లో కూడా లైంగిక వేధింపులు తప్పడం లేదు. ఇంగ్లాండ్లో ప్రతి పద్నాలుగు మంది యువతీయువకుల్లో ఒకరు తమ బాల్యంలో లైంగిక వేధింపులు ఎదుర్కున్న వారే ఉన్నారని ఓ సర్వే వెల్లడించింది.
శాతం వారిగా చూస్తే 11శాతం మహిళలు, మూడుశాతం పురుషులు, సగటున ఏడుశాతం మంది తమ బాల్యంలో లైంగిక వేధింపుల బారిన పడినట్లు తెలిపింది. ఇంగ్లాండ్, వేల్స్లో నిర్వహించిన క్రైమ్ సర్వేలో ఈ వివరాలు తెలిశాయి. 16 నుంచి 59 ఏళ్ల మధ్య ఉన్న స్త్రీ, పురుషుల్లో 5,67,000 స్త్రీలు, 1,02,000 మంది పురుషులు వారి బాల్యంలో లైంగిక వేధింపులకు గురయ్యారని సర్వే ఆందోళన వ్యక్తం చేసింది. ఇటీవల కాలంలో చిన్నారులపై లైంగిక వేధింపులు ఎక్కువవుతున్న నేపథ్యంలో ఈ సర్వే నిర్వహించగా ఈ కఠోర వాస్తవాలు తెలిశాయి.