పవన్‌ కలిసిన ఆ ప్రముఖుడు ఎవరంటే... | pawan kalyan meets Steve Jarding in Bostan | Sakshi
Sakshi News home page

పవన్‌ కలిసిన ఆ ప్రముఖుడు ఎవరంటే...

Published Fri, Feb 10 2017 4:37 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్‌ కలిసిన ఆ ప్రముఖుడు ఎవరంటే... - Sakshi

పవన్‌ కలిసిన ఆ ప్రముఖుడు ఎవరంటే...

బోస్టన్‌ :
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ బోస్టన్‌లో అంతర్జాతీయ రాజకీయ వ్యూహకర్తగా పేరున్న ఓ ప్రముఖ వ్యక్తిని కలుసుకున్నారు. అయనే  స్టీవ్‌ జార్డింగ్‌. భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున బోస్టన్‌లోని చార్లెస్‌ హోటల్‌లో పవన్‌, జార్డింగ్‌లు కలుసుకున్నారు. హార్వర్డ్‌ విశ్వవిద్యాలయంలోని కెనెడీ స్కూల్‌లో ప్రొఫెసర్‌గా పని చేస్తున్న జార్డింగ్‌కు పబ్లిక్‌ పాలసీ, రాజకీయ వ్యూహాల రూపకల్పనలో విశేష అనుభవం ఉంది. అమెరికాలోనే కాకుండా, వివిధ దేశాలకు చెందిన ప్రముఖ రాజకీయ నేతలు జార్డింగ్‌ నుంచి సూచనలు, సలహాలు తీసుకుంటుంటారు.
 
ఉత్తర్‌ప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ అభివృద్ధి కోసం ములాయం సింగ్‌ కూడా జార్డింగ్‌ నుంచి చాలాసార్లు సూచనలు స్వీకరించారు. అంతేకాకుండా ప్రస్తుత యూపీ ఎన్నికలకు కూడా జార్డింగ్‌ రూపొందించిన వ్యూహాలనే అఖిలేష్‌ యాదవ్‌ అమలు చేస్తున్నారు.

పవన్‌, జార్డింగ్‌ భేటీలో ఆంధ్రప్రదేశ్‌లో 2019లో జరగబోయే శాసన సభ ఎన్నికల గురించి చర్చించారు. పవన్‌కు రాజకీయ ఎత్తుగడలు, ఎన్నికల్లో అభ్యర్థుల ఎంపిక ఎలా చేయడం వంటి అంశాలతోపాటూ మరింత సమాచారాన్ని జార్డింగ్‌ దాదాపు రెండు గంటలపాటూ విశ్లేషణాత్మకంగా వివరించారు. ఈ సందర్భంగా జార్డింగ్‌కు పవన్‌ కృతజ్ఞతలు తెలిపారు. వీలుంటే ఎన్నికల ముందు మరోసారి కలుద్దామని జార్డింగ్‌ను పవన్‌ కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement