బొమ్మలతో ఆడుకుంటుంది
చిత్రంలోని అమ్మడి పేరు హాంగ్‌యీ.. చైనాలోని షాంగాయ్‌కు చెం దిన ఈమె చిత్రకారిణి. ఫుట్‌బాల్ ప్రపంచ కప్ సందర్భంగా హాంగ్ సాకర్ స్టార్లు రొనాల్డో, నెయ్‌మార్, మెస్సీల చిత్రాలను గీసింది. ఎలాగో తెలుసా? ఫుట్‌బాల్ ఆడుతూ..! నిజం.. ఈ చిత్రాలను ఆమె అలాగే గీసింది. ఫుట్‌బాల్‌ను వివిధ రంగులున్న బకెట్లలో ముంచి..
క్రమ పద్ధతిలో బాల్‌ను ఆడటం ద్వారా వీరి బొమ్మలను సృష్టించింది. వినూత్న తరహాలో చిత్రాలను గీయడంలో హాంగ్ పెట్టింది పేరు. గతంలోనూ సాక్సులతోనూ.. ఇతర వస్తువులతో రకరకాల పద్ధతుల్లో పెయింటింగ్‌లను చిత్రించింది.