పర్వతాలకు పేర్లు.. టెన్సింగ్ నార్వే, ఎడ్మండ్ హిల్లరీ
వాషింగ్టన్ : సౌర కక్ష్యలో సుదూరంగా తిరిగి ప్లూటో గ్రహంలోని పర్వతాలకు ఎడ్మండ్ హిల్లరీ, టెన్సింగ్ నార్వే పేర్లను ఇంటర్నేషనల్ ఆస్ట్రోనామికల్ యూనియన్ (ఐఏయూ) పెట్టింది. చీకటి గ్రహంగా పేరొందిన ప్లూటోలోని కొన్ని భౌగోళిక ప్రాంతాలకు పేర్లు పెట్టడం ఇదో మొదలు. ప్లూటో గ్రహంలోని భౌగోళిక అంశాలకు పేర్లు పెట్టాలని నిర్ణయానికి వచ్చిన తరువాత అనేక రకాల పేర్లు పరిశీలనకు వచ్చాయరని.. అయితే ఎవరెస్ట్ శిఖారాన్ని తొలిసారి అధిరోహించిన టెన్సింగ్ నార్వే, ఎడ్మండ్ హిల్లరీల పేర్లు పెట్టాలని ఐఏయూ నిర్ణయం తీసుకుంది.