లండన్: బ్రిటన్‌లో రెండో అత్యంత రద్దీ విమానాశ్రయమైన లండన్‌లోని గాట్విక్‌లో రెండ్రోజులుగా విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. విమానాశ్రయం చుట్టూ ఉన్న కంచె వద్ద బుధవారం రెండు డ్రోన్‌లు ఎగురుతూ కనిపించడంతో అధికారులు ముందస్తు చర్యగా విమానాల రాకపోకలను నిలిపేశారు. మళ్లీ గురువారం మధ్యాహ్నం కూడా ఒక డ్రోన్ కనిపించింది. దీంతో విమానాలు నడిపితే ఏదైనా ప్రమాదం జరగొచ్చనే ఉద్దేశంతో అధికారులు అప్రమత్తమై విమానాల రాకపోకలను అనుమతించడం లేదు.
క్రిస్మస్ సెలవులు ప్రారంభం కావడంతో ఇతర ప్రాంతాలకు విమానాల్లో వెళ్లాల్సిన లక్షలాది మంది ప్రజలు ఇక్కట్లకు గురవుతున్నారు. గురువారం ఒక్క రోజే 760 విమానాలు రద్దయ్యి 1.1 లక్షల మంది తమ ప్రయాణాలను రద్దు చేసుకోవాల్సి వచ్చింది. ఈ పరిస్థితిపై బ్రిటన్ ప్రధాని థెరెసా మే ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదో బాధ్యత లేని, ఏ మాత్రం అంగీకరించలేని ఘటన అని ఆమె అన్నారు. ఈ డ్రోన్లు ఉగ్రవాదులవైతే కాదని ఓ అధికారి స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment