సూపర్‌మార్కెట్ వద్ద మోహరించిన పోలీసులు
పారిస్: అనుమానిత ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాది ఒకరు ఫ్రాన్స్‌లో పేట్రేగిపోయాడు. ఒక్కరోజే మూడు చోట్ల దాడులకు పాల్పడి ముగ్గురిని బలిగొన్నాడు. తొలుత ఓ కారును హైజాక్ చేసి అందులో ప్రయాణిస్తున్న వ్యక్తిని చంపి డ్రైవర్‌ను గాయపరిచాడు. ఆ తరవాత జాగింగ్ చేస్తున్న పోలీసు అధికారిపై కాల్పులకు దిగాడు. ఆ తర్వాత ఓ సూపర్ మార్క్‌ట్‌లోకి ప్రవేశించి కాల్పులకు ఒడిగట్టి ఇద్దరిని హత్య చేశాడు. మరికొందరిని బందీలుగా తీసుకుని సుమారు మూడు గంటల పాటు తీవ్ర కలకలం సృష్టించాడు.
చివరకు పోలీసుల కాల్పుల్లో సూపర్ మార్కెట్‌లోనే హతమ య్యాడు. కార్కసోన్, దాని సమీపంలోని ట్రెబ్స్ పట్టణాల్లో శుక్రవారం ఉదయం ఐఎస్ సాయుధుడు ఈ వరస దాడులకు పాల్పడ్డాడు. నిందితుడు మొరాకో పౌరుడని విచారణాధికారులు గుర్తించారు. అతను ఉగ్రవాదుల వాచ్ లిస్టులో ఉన్నట్లు తెలిసింది. ఈ దాడులను తీవ్రమైనవిగానే పరిగణిస్తున్నామని ఫ్రాన్స్ ప్రధాని ప్రకటించారు. దుండగుడు ఐఎస్ కోసం పనిచేస్తున్నట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment