IS terrorist
-
భారత్‌పై రివైంజ్ కోసమే ఆత్మాహుతి దాడి ప్లాన్
భారత్‌లో కీలక నేతపై దాడులు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ప్లాన్ చేస్తున్నట్లు రష్యా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రష్యా బలగాల అదుపులో ఉన్న ఐఎస్ ఉగ్రవాది తామెందుకు ఈ ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశామో ఒక వీడియోలో వివరించాడు. ప్రవక్తను అవమానించినందుకు గానూ ప్రతికారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ దాడికి ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు భారతదేశ పాలక వర్గాలకు చెందిన ప్రతినిధుల్లో ఒకరిపై దాడి చేసేందుకు పథకం రచించినట్లు తెలిపాడు. ఆ ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందిన వ్యక్తిగా రష్యా పేర్కొంది. గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు టర్కీలో ఉన్నట్లు వెల్లడించింది. అక్కడ అతన్ని ఐఎస్ నాయకులలో ఒకరు ఆత్మాహుతి బాంబర్‌గా నియమించారని, ఇస్తాంబుల్‌లోని వ్యక్తిగత సమావేశాల్లో అతన్ని రిమోట్‌గా ప్రాసెస్ చేస్తారని తెలిపింది. ఈ మేరకు ఆ ఉగ్రవాదిని రష్యాలో రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) నిషేధించిన ఐఎస్ ఉగ్రవాది సభ్యుడిగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (చదవండి: భారత్‌లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్.. సూసైడ్ బాంబర్ అరెస్ట్!) -
ముల్లును ముల్లుతోనే తీయడమంటే ఇదే!
న్యూఢిల్లీ: ముల్లును ముల్లుతోనే తీయడమంటే ఇదే. ఢిల్లీలో దాడి చేయడానికి వచ్చిన ఐఎస్ ఉగ్రవాదిని నిఘా వర్గాలు ఉచ్చు పన్ని మరీ పట్టుకున్నాయి. సుమారు 18 నెలల పాటు సాగిన ఈ ఆపరేషన్ హాలివుడ్ సినిమాకు ఏ మాత్రం తక్కువ కాదంటే అతిశయోక్తి కాదు. ఆ ఉగ్రవాదిని నమ్మించడానికి మనోడిని ఉగ్రవాదిగా అతనికి పరిచయం చేయడం దగ్గర నుంచి, పట్టుబడిన ఉగ్రవాది వెల్లడించిన సమాచారం వరకు ఇదో మంచి సస్పెన్స్ థ్రిల్లర్‌ను తలపిస్తోంది. గత సెప్టెంబర్‌లోనే ఐఎస్ ఉగ్రవాదిని అరెస్ట్ చేయగా, అధికారులు ఆ వివరాలను తాజాగా వెల్లడించారు. పాకిస్తాన్లో ఉగ్రశిక్షణ పొందిన 12 మంది ఐఎస్ ఉగ్రవాదుల బృందం భారత్‌తో పాటు ఇతర దేశాల్లో బాంబుదాడులకు తెగపడనున్నట్టు నిఘావర్గాలకు (రిసెర్చీ అనాలిసిస్ వింగ్–రా) సమాచారం అందింది. ఐఎస్ కార్యకలాపాల నిమిత్తం దుబాయ్ నుంచి కొందరు వ్యక్తులు అఫ్గానిస్తాన్‌కు సుమారు రూ.34 లక్షలు పంపినట్లు అమెరికా నిఘా అధికారులు గుర్తించారు. దీనికి సంబంధించి అనేక టెలిఫోన్‌కాల్స్‌ను ట్యాప్ చేసిన తరువాత అఫ్గానిస్తాన్ సంపన్న కుటుంబానికి చెందిన ఓ వ్యక్తి ఢిల్లీలో ఆత్మాహుతికి పాల్పడేందుకు వస్తున్నట్టు తెలిసింది. కీలక సమాచారం లభ్యం.. ఇంజనీరింగ్ విద్యార్ధిగా భారత్‌కు వచ్చిన ఉగ్రవాదితో స్నేహం పెంచుకునేందుకు కౌంటర్ ఇంటెలిజెన్స్ విభాగం ఐఎస్ ఏజెంట్ అవతారంలో ఓ వ్యక్తిని పంపింది. అతని ద్వారానే ఉగ్రవాదికి లజ్‌పత్‌నగర్‌లో వసతితో పాటు, పేలుడుపదార్థాలు సమకూర్చారు. ఢిల్లీలో ఐఎస్ ఉగ్రవాది కదలికలపై నిఘా పెట్టేందుకు నెలరోజుల నిరంతరం 80 మంది సిబ్బంది పనిచేశారు. ఆత్మాహుతి దాడుల కోసం ఢిల్లీ విమానాశ్రయం, అన్సల్ ప్లాజా మాల్, వసంత్‌కుంజ్ మాల్, సౌత్ ఎక్స్టెన్షన్ మార్కెట్లలో ఉగ్రవాది రెక్కీ నిర్వహించాడు. వీటన్నింటిని కనిపెట్టిన భద్రతా అధికారులు సమయం చూసుకుని అతన్ని అరెస్ట్ చేసి అఫ్గానిస్తాన్‌లోని అమెరికా దళాలకు అప్పగించారు. పట్టుబడిన ఉగ్రవాది ద్వారా 11 మంది సహచరుల కదలికలు కనుక్కోవడంతో పాటు, అతడిచ్చిన సమాచారంతో అనేక ఐఎస్ స్థావరాలపై అమెరికా దళాలు దాడులు చేశాయి. ఇటీవల అఫ్గానిస్తాన్‌లో తాలిబన్లపై అమెరికా దళాలు పై చేయి సాధించేందుకు అవసరమైన సమాచారాన్ని అతడి వద్దే సేకరించారు. 2017 మే 22న బ్రిటన్‌లో 23 మందిని బలిగొన్న మాంచెస్టర్ దాడి అతడి సహచరుల్లోని ఒకరి పనేనని తేలింది. ఆ దాడిలో ఏయే పేలుడు పదార్థాలు వాడారో, అలాంటి వాటినే ఢిల్లీ పేలుళ్లలో వాడాలని అతడు కోరుకున్నట్లు తెలిసింది. -
ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి..ముగ్గురు మృతి
-
ఫ్రాన్స్‌లో ఉగ్రదాడి
పారిస్: అనుమానిత ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాది ఒకరు ఫ్రాన్స్‌లో పేట్రేగిపోయాడు. ఒక్కరోజే మూడు చోట్ల దాడులకు పాల్పడి ముగ్గురిని బలిగొన్నాడు. తొలుత ఓ కారును హైజాక్ చేసి అందులో ప్రయాణిస్తున్న వ్యక్తిని చంపి డ్రైవర్‌ను గాయపరిచాడు. ఆ తరవాత జాగింగ్ చేస్తున్న పోలీసు అధికారిపై కాల్పులకు దిగాడు. ఆ తర్వాత ఓ సూపర్ మార్క్‌ట్‌లోకి ప్రవేశించి కాల్పులకు ఒడిగట్టి ఇద్దరిని హత్య చేశాడు. మరికొందరిని బందీలుగా తీసుకుని సుమారు మూడు గంటల పాటు తీవ్ర కలకలం సృష్టించాడు. చివరకు పోలీసుల కాల్పుల్లో సూపర్ మార్కెట్లోనే హతమ య్యాడు. కార్కసోన్, దాని సమీపంలోని ట్రెబ్స్ పట్టణాల్లో శుక్రవారం ఉదయం ఐఎస్ సాయుధుడు ఈ వరస దాడులకు పాల్పడ్డాడు. నిందితుడు మొరాకో పౌరుడని విచారణాధికారులు గుర్తించారు. అతను ఉగ్రవాదుల వాచ్ లిస్టులో ఉన్నట్లు తెలిసింది. ఈ దాడులను తీవ్రమైనవిగానే పరిగణిస్తున్నామని ఫ్రాన్స్ ప్రధాని ప్రకటించారు. దుండగుడు ఐఎస్ కోసం పనిచేస్తున్నట్లు భావిస్తున్నామని అధికారులు తెలిపారు. -
కాబూల్‌లో ఆత్మాహుతి దాడి.. 29 మంది మృతి
కాబూల్: అఫ్గానిస్తాన్ రాజధాని కాబూల్ మరోమారు రక్తమోడింది. షియా ముస్లింలు పర్షియన్ నూతన సంవత్సర వేడుకల్లో ఉండగా.. జరిగిన ఆత్మాహతి దాడిలో కనీసం 29 వరకు మృతి చెందారు. ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిలో మరో 52 మంది వరకు గాయపడినట్లు ప్రభుత్వం తెలిపింది. ‘కాబూల్ యూనివర్సిటీ, ప్రభుత్వ ఆస్పత్రికి సమీపంలో ఈ దాడి జరిగింది. పోలీసు తనిఖీలకు చిక్కకుండా వెళ్లిన ఉగ్రవాది.. అక్కడ తనను తాను పేల్చేసుకున్నాడు’ అని వెల్లడించింది. -
ఐఎస్ అనుమానిత ఉగ్రవాది అరెస్ట్
లక్నో: అనుమానిత ఐఎస్ ఉగ్రవాది అబూ జైద్‌ను ఉత్తరప్రదేశ్ ఉగ్ర వ్యతిరేక బృందం(ఏటీఎస్) అరెస్ట్ చేసింది. సౌదీ నుంచి వచ్చిన జైద్‌ను శనివారం ముంబై ఎయిర్‌పోర్టులో అరెస్టుచేసినట్లు పోలీసులు చెప్పారు. అతన్ని ట్రాన్సిట్ రిమాండ్‌పై లక్నోకు తరలించి కోర్టులో హాజరుపరిచాక కస్టడీలోకి తీసుకుని పోలీసులు విచారిస్తారు. రియాద్‌లో నివసిస్తున్న జైద్...యువకులను ఐఎస్ వైపు ఆకర్షించేందుకు సామాజిక మాధ్యమాలలో ఓ గ్రూపును నిర్వహిస్తున్నాడు. ఏప్రిల్‌లో అరెస్టయిన కొందరు ఐఎస్ ఉగ్రవాదులను విచారించగా జైద్ పేరు బయటకొచ్చింది. -
మరో ఐఎస్ ఉగ్రవాది పట్టివేత
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న 25 ఏళ్ల యువకుడిని పశ్చిమ బెంగాల్ సీఐడీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మహ్మద్ మసియుద్దీన్ అలియాస్ మూసా అనే ఈ యువకుడిని బర్ద్వాన్ రైల్వే స్టేషన్లో పట్టుకుని, సీఐడీ ప్రధాన కార్యాలయానికి తీసుకొచ్చారు. విశ్వభారతి ప్యాసింజర్ రైలు నుంచి అతడిని పట్టుకున్నారు. బిర్భూమ్ జిల్లాలోని తన స్వగ్రామం లభ్పూర్ వెళ్తుండగా అతడు దొరికాడు. ఐఎస్ ఉగ్రవాద సంస్థతో సంబంధాలున్న యువకుడు చెన్నై నుంచి హౌరా మీదుగా బిర్భూమ్ వెళ్తున్నట్లు తమకు సమాచారం అందిందని, దాని ఆధరాంగా మసియుద్దీన్ను బర్ద్వాన్ రైల్వేస్టేషన్లో పట్టుకున్నామని సీఐడీ డీఐజీ దిలీప్ కుమార్ అడక్ తెలిపారు. లభ్పూర్కు చెందిన మసీయుద్దీన్ తమిళనాడులోని తిరుప్పూర్‌లో తన భార్య, ఇద్దరు పిల్లలతో కలిసి ఉంటూ ఓ కిరణా దుకాణంలో పనిచేసేవాడు. అతడి వద్ద నుంచి 13 అంగుళాల కత్తి, అత్యాధునిక తుపాకి, మూడు బుల్లెట్లు స్వాధీనం చేసుకున్నామని, అతడి మొబైల్ ఫోన్ డేటాను పరిశీలిస్తున్నామని అడక్ చెప్పారు. కేంద్ర నిఘా సంస్థలు అతడిని విచారిస్తున్నాయన్నారు. ప్రాథమిక విచారణను బట్టి విదేశీ ఉగ్రవాదులతో సంబంధం ఉన్నట్లు తెలిసిందని, ఐఎస్ అవునా కాదా అన్న విషయాన్ని కూడా కొట్టిపారేయలేమని చెప్పారు. -
'ప్రతి రోజూ అత్యాచారం చేసేవారు'
లండన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు మహిళల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వందలాది మంది మహిళలను కిడ్నాప్ చేసి హింసించడం, సామూహిక అత్యాచారం చేయడం, బలవంతంగా వారి ద్వారా పిల్లలను కనడం వంటి అరాచకాలకు పాల్పడుతున్నారు. 9 నెలలు ఐఎస్ ఉగ్రవాదుల చెరలో ఉండి, వారి నుంచి తప్పించుకున్న ఓ బాధితురాలి తన వ్యథను తెలియజేసింది. ఐఎస్ ఉగ్రవాదులు జిహాదీ పేరుతో చేస్తున్న హింసను ఇరాక్‌లోని సింజన్ పట్టణానికి చెందిన 17 ఏళ్ల యజీదీ తెగ అమ్మాయి వెల్లడించింది. 'గతేడాది ఆగస్టులో నన్ను, నా సోదరిని ఐఎస్ ఉగ్రవాదులు కిడ్నాప్ చేశారు. మమ్మల్ని సిరియాలో ఐఎస్ ఆధీనంలో ఉన్న రక్కాకు తరలించారు. మా ఇద్దరితో పాటు పదుల సంఖ్యలో యువతులకు కన్యత్వ పరీక్షలు చేయించారు. మమ్మల్నందరినీ ఓ గదిలోకి తీసుకెళ్లి వరుసగా నిలబెట్టారు. ఉగ్రవాదులు తమకు నచ్చిన అమ్మాయిలను ఎంచుకున్నారు. అందంగా లేకపోవడం నా అదృష్టం కావచ్చు. నన్ను, నా చెల్లిని, మరో ఇద్దరు అమ్మాయిలను అమ్మేశారు. చెచెన్యాకు చెందిన అల్-రషియా అనే ఐఎస్ ఉగ్రవాదికి మమ్మల్ని కొనుగోలు చేశాడు. మమ్మల్ని రోజూ ఉదయం నగ్నంగా నిలబెట్టేవారు. యజమాని తనకు నచ్చినవారిని అత్యాచారం చేసేవాడు. ఆయనతో పాటు అనుచరులు మమ్మల్ని రోజూ దారుణంగా హింసించి సామూహిక అత్యాచారం చేసేవారు. వారి శారీకవాంఛలు తీర్చకపోతే వేడి నీళ్లను కాళ్లపై పోసి చిత్రహింసలు పెట్టేవారు. ఆ తొమ్మిది నెలలూ చస్తూ బతికాను. నన్ను గర్భవతిని చేశారు. గత నెలలో అల్ -రషియాను, అతని బాడీగార్డులను ఖుర్దిష్ సైనికులు కాల్చివేశారు. దీంతో మాకు స్వేచ్ఛ లభించింది. -
ఐఎస్ ఉగ్రవాద నేత అబు సయ్యఫ్ కాల్చివేత
వాషింగ్టన్: ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సీనియర్ నేత అబు సయ్యఫ్ను అమెరికా కమెండో దళాలు మట్టుబెట్టాయి. సిరియాలో అల్లకల్లోలం సృష్టిస్తున్న ఐఎస్ఐఎస్ నేతను రహస్యంగా నిర్వహించిన ఆపరేషన్‌లో హతమార్చినట్లు అమెరికా శనివారం ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆదేశాల మేరకు ఈశాన్య సిరియాలో సయ్యఫ్ను కాల్చి చంపాయి. అతడి భార్య ఉమ్ సయ్యఫ్ను ఇరాక్‌లోని అమెరికా సైనిక స్థావరంలో విచారిస్తున్నారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల కార్యకలాపాలతో ఆమెకు కూడా సంబంధం ఉన్నట్లు భావిస్తున్నారు. ఐఎస్ ఉగ్రవాదులు అక్రమంగా చమురు నిల్వలు, ఆర్థిక వనరులను సమకూర్చుకోవటంలో అబు సయ్యఫ్ పాత్ర ఉన్నట్లు అమెరికా తెలిపింది.