ముక్కలైన సింహం కోసం.. | Polish experts in Syria's Palmyra to restore lion statue | Sakshi
Sakshi News home page

ముక్కలైన సింహం కోసం..

Published Fri, Apr 22 2016 11:38 AM | Last Updated on Sun, Sep 3 2017 10:31 PM

ముక్కలైన సింహం కోసం..

ముక్కలైన సింహం కోసం..

పామిరా(సిరియా): ఉగ్రవాదుల దాడిలో సిరియాలోని పామిరా మ్యూజియంలో ధ్వంసమైన భారీ సింహపు ఆకారాన్ని తిరిగి పునరుద్దరించేందుకు పాలిష్ హెరిటేజ్ నిపుణులు సిద్ధమవుతున్నారు. ఈ సందర్భంగా గతంలో తాము ప్రతిష్టించిన ఆ సింహపు ఆకారం నేటమట్టమై పోవడం గురించి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తాము ఎంతో కష్టపడి రూపొందించిన ఈ సింహపు తలభాగం ఇలా ముక్కలై తమకు కనిపిస్తుందని అస్సలు ఊహించలేదని తెలిపారు.

మార్కోవోస్కీ అని శిల్ప నిపుణుడు మాట్లాడుతూ '2005లో ఈ సింహాపు ప్రతిమను ప్రతిష్టించే సమయంలో ఇది కనీసం 200 నుంచి 300 ఏళ్ల వరకు ఉంటుందని లేదా అంతకంటే ఎక్కువ సమయమే ఉంటుందని భావించాను. కానీ పదేళ్లు తిరగకుండానే ఇలా చూడాల్సి వచ్చింది. 15 టన్నుల బరువుండే ఈ భారీ ప్రతిమ 2015 మే నెలలో ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు జరిపిన బాంబు దాడుల్లో రెండు ముక్కలై పోయింది. దాని ముఖ భాగం చిన్నచిన్న ముక్కులుగా మిగిలిపోయింది. క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన మూడు మీటర్ల ఈ ప్రతిష్టాత్మక సింహపు ప్రతిమను 1977లో గుర్తించారు. అప్పట్లోనే   ఇదొక్కటే కాకుండా ఎన్నో ప్రముఖ ఆలయాలను ఉగ్రవాదులు ధ్వంసం చేశారు.  

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement