మాడ్రిడ్: బ్రిటన్‌లో రెఫరెండం ఫలితంతో కలకలం రేగుతుండగానే.. స్పెయిన్‌లో మరోసారి తాజాగా ఎన్నికలు నిర్వహించాలనే డిమాండ్ ఊపందుకుంది. దేశంలో నిరుద్యోగం పెరిగిపోవటంతోపాటు అస్థిరత నెలకొందనే కారణంతో.. ప్రజలంతా రోడ్లపైకి వచ్చి ఎన్నికలకోసం నిరసన ప్రదర్శనలు చేపడుతున్నారు. పోడెమోస్ నేతృత్వంలోని లెఫ్ట్ కూటమి ప్రభుత్వం తప్పుకోవాలని డిమాండ్ చేస్తోంది. కాగా బ్రెగ్జిట్ నిర్ణయంతో అమెరికా చాలా బాధపడుతోందని అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ అన్నారు. బ్రిటన్, ఈయూతో ఆయన చర్చించనున్నారు.