
ఆ మందు మూలంగానే ప్రిన్స్ మరణం
లాస్ ఏంజెల్స్ : వరల్డ్ రాక్ స్టార్ గా పేరు తెచ్చుకున్న సింగర్ ప్రిన్స్ (57)మరణం పై అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రమాదవశాత్తు పెయిన్ కిల్లర్ మోతాదుకు మించి తీసుకోవడం వల్లనే చనిపోయాడని మిడ్ వెస్ట్ మెడికల్ ఎగ్జామ్ తన నివేదికలో తేల్చి చెప్పింది. వీరు అందించిన టాక్సికాలజీ (విషపదార్ధాలు, మత్తు పదార్ధా లను గురించి తెలిపే శాస్త్రం) రిపోర్టును ట్విట్టర్ లో రిలీజ్ చేశారు. ఓపియోడ్ ఫెంటానేల్ మందు మితిమీరిన కారణంగానే ప్రిన్స్ మరణం సంభవించిందని స్పష్టం చేసింది.
క్యాన్సర్ చికిత్స వాడే ఫెంటానేల్ మత్తుమందు కంటే ఎక్కువ శక్తివంతమైందని వైద్యులం దించిన రిపోర్టులో వెల్లడించింది. అయితే గాయం ఎలా జరిగింది, అక్రమంగా తయారవుతున్న ఆ మందును ప్రిన్స్ ఎలా వాడాడు అనే వివరాలు నివేదికలో పేర్కొనలేదు. అక్రమంగా అధిక మోతాదులో లభ్యమవుతున్న ఫెంటానేల్ .. హెరాయిన్ కంటే 25 నుంచి 50 రెట్లు, మార్ఫిన్ కంటే 50 నుంచి 100 రెట్లు ఎక్కువ శక్తివంతమైన దేశంలో అనేక మరణాలు సంభవిస్తున్నాయని డ్రగ్ ఎన్ఫోర్స్ మెంట్ అడ్మినిస్ట్రేషన్ పేర్కొంది.
మల్టీ టాలెండెట్ ప్రిన్స్ ( ప్రిన్స్ రోగర్స్ నెల్సన్ ) 1978లో సింగర్ గా పరిచయమై ఆ తరువాత ప్రపంచవ్యాప్తంగా రాక్ సంగీతప్రియులను ఆకట్టుకున్నారు. దాదాపు 30కి పైగా ఆల్బమ్ లతో ఉర్రూతలూగించి సూపర్ స్టార్ గా పేరు తెచ్చుకున్నారు. దీంతోపాటు ఆయన కొన్ని హాలివుడ్ సినిమాలలో కూడా నటించారు. ఈ ఏప్రిల్ 21 రికార్డింగ్ స్టూడియో లోని ఒక ఎలివేటర్ లో మరణించడం పలు అనుమానాలు తావిచ్చింది. అతని మరణంతో ఆయన అభిమానులు తీవ్ర విషాదంలో మునిగిపోయింది. కాగా అమెరికా అధ్యక్షుడు ఒబామా..ప్రిన్స్ మరణాన్ని తట్టుకోలేక కన్నీరు పెట్టుకున్నారు. ఆయన మృతి మిషెల్లీతోపాటు తనను తీవ్రంగా కలచివేసిందని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని ఒబామా సంతాపం ప్రకటించిన సంగతి తెలిసిందే.