భూమితో పాటే తిరిగే శకలం | Rotating Fragment Concurrently with the earth | Sakshi
Sakshi News home page

భూమితో పాటే తిరిగే శకలం

Published Sat, Jun 18 2016 1:22 AM | Last Updated on Mon, Sep 4 2017 2:44 AM

భూమితో పాటే తిరిగే శకలం

భూమితో పాటే తిరిగే శకలం

ఎప్పుడూ భూమితో పాటే నిర్ణీత కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరిగే ఓ గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు.

లాస్‌ఏంజెలెస్: ఎప్పుడూ భూమితో పాటే నిర్ణీత కక్ష్యలో సూర్యుని చుట్టూ తిరిగే ఓ గ్రహశకలాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఇది భూమి చుట్టూ కొన్ని శతాబ్దాల పాటు తిరుగుతుందని వారు అంచనా వేస్తున్నారు. దీనికి వారు 2016 హెచ్‌ఓ3 అని నామకరణం చేశారు. ఇది ఓ నిర్ణీత కక్ష్యలో భూమి చుట్టూ కూడా తిరుగుతుంది.కానీ దీన్ని భూమికి ఉపగ్రహంగా భావించలేం. కొన్నేళ్ల క్రితం 2006 వైఎన్107 అనే గ్రహశకలం కూడా ఇలానే చేసింది. కానీ కొన్నేళ్ల తర్వాత అది కనబడకుండా పోయింది.

కానీ 2016 హెచ్‌ఓ3 మాత్రం కనీసం ఓ శతాబ్దం పాటు భూమితో పాటే ఉంటుందని వీరు అంచనా వేస్తున్నారు. దీని కక్ష్య కూడా కొంచెం వంకరగా ఉందని వీరు చెబుతున్నారు. భూ గురుత్వాకర్షణ శక్తి వల్ల భూమికి చంద్రుడి కంటే 38 రెట్ల దూరంలో ఉందని పేర్కొన్నారు. ఈ సంవత్సరం ఏప్రిల్ 27న ఇది మొట్టమొదటి సారి కనిపించిందట!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement