
‘టైటాన్’పై అతి ఎత్తైన శిఖరం
లాస్‌ఏంజెలిస్: శనిగ్రహం చందమామ టైటాన్‌పై పరిశోధనలు చేసేందుకు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రయోగించిన కాసినీ మిషన్ అద్భుతాన్ని ఆవిష్కరించింది. శని ఉపగ్రహాల్లో అతిపెద్దదైన ఈ టైటాన్‌పై అతిపెద్ద శిఖరాన్ని గుర్తించింది. దీని ఎత్తు దాదాపు 3,337 మీటర్లు ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
ఈ ఉపగ్రహంపై ఉన్న అతి ఎత్తై ప్రాంతం మిత్రిం మాంటీస్ అనే ప్రాంతంలో ఉన్నట్లు గుర్తించారు. ఎత్తై పర్వత శిఖరాలు ఎక్కువగా ఈ ఉపగ్రహం టైటాన్ మధ్యరేఖ (ఈక్వేటర్)ను ఆనుకునే ఉన్నాయని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. కాసినీ రాడార్ పరికరం నుం చి సేకరించిన ఛాయాచిత్రాలు, సమాచారాన్ని అధ్యయనం చేయడం ద్వారా వారు ఈ విషయాలను గుర్తించారు. ‘మేం గుర్తించింది ఎత్తై శిఖరమే కాదు.. టైటాన్‌పై ఉన్న అతి ఎత్తై ప్రదేశం కూడా అని భావిస్తున్నాం’ అని ప్రధాన పరిశోధకుడు స్టీఫెన్ వాల్ చెప్పారు.