లండన్ మేయర్‌గా ముస్లిం | Sadiq Khan Elected in London, Becoming Its First Muslim Mayor | Sakshi
Sakshi News home page

లండన్ మేయర్‌గా ముస్లిం

Published Sun, May 8 2016 1:53 AM | Last Updated on Sat, Mar 23 2019 8:28 PM

లండన్ మేయర్‌గా ముస్లిం - Sakshi

లండన్ మేయర్‌గా ముస్లిం

లండన్: బ్రిటన్ రాజధాని లండన్ మేయర్‌గా తొలిసారి ఒక ముస్లిం వ్యక్తి ఎన్నికయ్యారు. ఈ మేరకు రికార్డు మెజారిటీతో గెలిచిన సాదిఖ్ ఖాన్ (45) అధికారికంగా సౌత్‌వార్క్ కేథడ్రల్‌లో జరిగిన కార్యక్రమంలో లండన్ మేయర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పాకిస్తాన్ చెందిన బస్సు డ్రైవర్ కుమారుడు సాధిఖ్ ఖాన్ లేబర్ పార్టీ తరఫున పోటీచేసి కన్జర్వేటివ్ పార్టీ అభ్యర్థి జాక్ గోల్డ్‌స్మిత్‌పై 9 శాతం ఓట్లతో గెలుపొందారు. దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత లండన్‌లో లేబర్ పార్టీ తన సత్తా చాటింది. లేబర్ పార్టీ తరఫున కెన్ లివింగ్‌స్టన్, కన్జర్వేటీవ్ తరఫున బోరిస్ జాన్సన్‌ల తర్వాత లండన్ మేయర్ పీఠాన్ని అధిష్టించిన మూడో వ్యక్తిగా సాధిఖ్ ఖాన్ రికార్డు సృష్టించారు.

మేయర్‌గా ప్రమాణం తర్వాత సాధిఖ్ మాట్లాడుతూ.. ‘లండన్ ప్రపంచంలోనే అత్యున్నత నగరం. నాలాంటి వ్యక్తికి లండన్ మేయర్‌గా అవకాశం కల్పించినందుకు ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నాపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాను’ అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement