సౌదీ కింగ్‌ మరో కీలక నిర్ణయం | Saudi king appoints 30 judges, promotes 26 amid anti-corruption purge | Sakshi
Sakshi News home page

సౌదీ కింగ్‌ మరో కీలక నిర్ణయం

Published Thu, Nov 9 2017 8:29 PM | Last Updated on Mon, Aug 20 2018 7:34 PM

 Saudi king appoints 30 judges, promotes 26 amid anti-corruption purge - Sakshi

సౌదీ కింగ్‌ మొహమ్మద్ బిన్ సల్మాన్ మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. గురువారం సౌదీ కింగ్‌ కొత్తగా 30 మంది జడ్జీలను నియమించడంతో పాటు 26 మందిని ప్రమోట్‌ చేసినట్టు సౌదీ అరేబియా స్టేట్‌ న్యూస్‌ ఏజెన్సీ ఎస్‌పీఏ రిపోర్టు చేసింది. అవినీతి కేసులో 11 మంది యువరాజులను, నలుగురు మంత్రులను, డజన్ల కొద్దీ మాజీ మంత్రులను అరెస్ట్‌ చేసిన నేపథ్యంలో ఈ నియామకం, ప్రమోషన్లు చర్చనీయాంశమైంది. సల్మాన్ ఆదేశాలతోనే వీరిని పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. మనీ లాండరింగ్‌, లంచం, వ్యక్తిగత లాభం కోసం ప్రభుత్వ కార్యాలయాన్ని దోచుకోవడం, దోపిడీ చేయడం వంటి ఆరోపణలు వీరిపై ఉన్నాయి. 

26 మంది జడ్జీలను ప్రమోట్‌ చేస్తున్నట్టు మరో 30 మందిని జ్యుడీషియరీలో వివిధ స్థానాల్లో నియమిస్తున్నట్టు సౌదీ రాజు రాయల్‌ ఆర్డర్‌ జారీచేశారు. అదుపులోకి తీసుకున్న వారి బ్యాంకుల సమాచారం అందించాలని యునిటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని రెగ్యులేటర్స్‌ ఇప్పటికే ఆదేశించాయి. వీలైతే వీరి అకౌంట్లను కూడా ఫ్రీజ్‌ చేయాలని పేర్కొన్నాయి. సెంట్రల్‌ బ్యాంకు ఆదేశాల మేరకు 1700 దేశీయ బ్యాంకు అకౌంట్లను ఫ్రీజ్‌ చేశామని బ్యాంకింగ్‌ వర్గాలు చెప్పాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement