భర్త సెకండ్ హనీమూన్ కు వెళ్లాడని..
భర్త సెకండ్ హనీమూన్ కు వెళ్లాడన్న కోపంతో భార్య ఇల్లు తగులబెట్టిన ఘటన సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. రెండో భార్యతో కలిసి భర్త విదేశాలకు రెండో హనీమూన్ కు వెళ్లాడని తెలుసుకున్న మొదటి భార్య ఆగ్రహంతో ఇల్లు తగుల బెట్టిందని గల్ఫ్ న్యూస్ వెల్లడించింది.
10 ఏళ్ల క్రితం పెళ్లెన ఆమెకు సెల్ ఫోన్ లో వచ్చిన మెసేజ్ చూసి షాక్ తింది. రెండో భార్యతో కలిసి అతడు విదేశాలకు హనీమూన్ కు వెళ్లాడని ఆ మెసేజ్ లో ఉంది. దీంతో ఆమె ఆగ్రహంతో ఊగిపోయింది. విచక్షణ కోల్పోయి జాజన్ పోర్ట్ సిటీలోని తన ఇంటికి నిప్పు పెట్టింది. అయితే తగలబడి పోతున్న ఇంటిని చూసి మంటలు ఆర్పేందుకు సహాయం చేయాలని పొరుగింటి వారిని కోరడం గమనార్హం.
అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ఘటనలో ఐదేళ్ల బాలుడికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.