వాషింగ్టన్: బాలురు, బాలికల ప్రత్యేక పాఠశాలలు పెద్దగా సత్ఫలితాలు ఇవ్వవట. కో ఎడ్యుకేషన్ స్కూళ్లతో పోలిస్తే ప్రత్యేక పాఠశాలలో చదువుకునే విద్యార్థులు ఎక్కువగా నేర్చుకోవడం ఉండదట. విద్యాభ్యాసం మొదలు అన్ని విషయాల్లోనూ కో ఎడ్యుకేషన్ స్కూళ్ల విద్యార్థులే ముందంజలో ఉన్నారట. అమెరికాలో నిర్వహించిన ఓ పరిశోధనలో ఈ మేరకు కనుగొన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా 16 లక్షల మంది విద్యార్థులపై 184 పరిశోధనలు నిర్వహించి ఓ నివేదిక రూపొందించారు. 21 దేశాల్లో విద్యార్థులను పరీక్షించారు. కో ఎడ్యుకేషన్, ప్రత్యేక స్కూళ్లలో చదివే విద్యార్థుల్లో గణితం, సైన్స్ ఇతర సబ్జెక్టులలో ప్రతిభ, దృక్పథం, చొరవ తదితర అంశాలను పరిశీలించారు. ఈ నివేదికను అమెరికా సైకాలజికల్ అసోసియేషన్ జర్నల్ బులిటెన్లో ప్రచురించారు.
బాలురు, బాలికలు కలిసి చదివితేనే లాభం!
Published Mon, Feb 3 2014 6:02 PM | Last Updated on Fri, Jul 12 2019 3:37 PM
Advertisement
Advertisement