మాస్కో : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మరో సాహసం చేశారు. జనవరి 19న మతపరమైన కార్యక్రమాలు నిర్వహించే క్రమంలో.. మైనస్ డిగ్రీల చలిలో.. నదీ స్నానం చేశారు. పుతిన్ స్నానం చేస్తున్న సమయంలో.. సెలిగర్ సరస్సులో నీళ్లు గడ్డకట్టి ఉన్నాయి. సాధారణంగా రష్యాలోని ఆర్థోడాక్స్ క్రైస్తవులు.. మతపరమైన కార్యక్రమాలు నిర్వహించేందుకు జనవరి 18, 19 తేదీల్లో ఇలా స్నానాలు చేస్తుంటారు.
ఈ ఏడాది చలి విపరీతంగా ఉండడం, ఉష్ణోగ్రతలు మైనస్‌కు పడిపోవడంతో.. చాలామంది ఇళ్లలోనే వేడినీటితో స్నానాలు చేశారు. అయితే 65 ఏళ్ల పుతిన్ మాత్రం.. చలికి ఏమాత్రం భయపడక.. సెలిగర్ సరస్సులోనే ఒక్క మునక వేసి ధైర్యంగా బయటకు వచ్చారు. మతాచరణపై అధ్యక్షుడుకి ఉన్న దీక్ష, విశ్వాసంపై రష్యాన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పుతిన్ సరస్సులో మునక వేసే వీడియో.. ప్రస్తుతం సోషల్ మీడియాల హల్‌చల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment