సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌ను నిలువరించేందుకు ప్రపంచ దేశాలు లాక్‌డౌన్‌ను పాటిస్తుండడంతో సోషల్ మీడియా ఊపందుకుంటోంది. ఫేస్‌బుక్, ఇన్‌స్ట్రామ్ కొద్దిగా బలపడగా, లఘు వీడియోల షేరింగ్ ఆప్స్ టిక్‌టాక్, లీవ్‌డాట్‌మీ, బిగో అనూహ్యంగా దూసుకుపోతున్నాయి. ఫిబ్రవరి రెండవ తేదీ నుంచి మార్చి 29వ తేదీ వరకు వీటి ఎదుగుదల గ్రాఫ్‌ను మార్కెట్ పరిమాణాల విశ్లేషణా సంస్థ ‘కాలాగాటో’ విశ్లేషించి వివరాలను విడుదల చేసింది.యూజర్లు ఎక్కువ సమయాన్ని వెచ్చించే విషయంలో 16 ఏళ్ల క్రితం ప్రారంభమైన ‘ఫేస్‌బుక్’కన్నా 2012లో వచ్చిన ‘టిక్‌టాక్’ ముందుకు దూసుకుపోయింది. టిక్‌టాక్‌పై యూజర్లు సరాసరి వెచ్చించే సమయం లాక్‌డౌన్ కారణంగా 39.5 నిమిషాల నుంచి 56,9 నిమిషాలకు పెరిగింది. ఈ విషయంలో 80 కోట్ల మంది యూజర్లను కలిగిన ‘ఫేస్‌బుక్’ను అధిగమించడం విశేషం.(మే 3 వరకు లాక్‌డౌన్ : మోదీ)
‘లీవ్‌డాట్‌మీ’ మీద యూజర్లు వెచ్చించే సమయం 315 శాతం పెరగ్గా, బిగో మీద 66 శాతం పెరిగింది. ఇన్‌స్టాగ్రామ్‌ను యూజర్లలో 59 శాతం మంది ప్రతి రోజు సరాసరి ఉపయోగించగా, టిక్‌టాక్‌ను 53 శాతం మంది ఉపయోగించారు. సామాజిక దూరం, ఇంటి నుంచి పనిచేసే విధానం అమల్లోకి వచ్చాక సోషల్ మీడియా ఫ్లాట్ ఫారమ్‌ల వినియోగం బాగా పెరిగిందని ‘కాలాగాటో’ తెలిపింది.
రోజూ ఆఫీసులకు వెళ్లి ఎంత కష్టపడి పని చేస్తున్నామో ఇంట్లోని వారికి తెలియజేయడం కోసం కొందరు, ట్రాఫిక్‌లో పడి ఆఫీసు నుంచి ఇంటికొచ్చే సమయాన్ని దృష్టిలో పెట్టుకొని మరికొందరు సిస్టమ్స్‌ను పట్టుకొని వేలాడడం వల్ల సోషల్ మీడియా వినియోగం పెరిగిందని కాలాగాటో పేర్కొనడం హైలైట్.(మోదీజీ! ఈ ప్రశ్నలకు బదులేదీ?)
Comments
Please login to add a commentAdd a comment