బ్రిటన్ పీఠం కోసం రేసు మొదలు
లండన్: బ్రెగ్జిట్ రెఫరెండం నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన డేవిడ్ కామెరాన్ స్థానంలో కొత్త ప్రధానిగా పగ్గాలు చేపట్టేందుకు కన్సర్వేటివ్ పార్లమెంటు సభ్యుల మధ్య రేసు మొదలైంది. బ్రెగ్జిట్ అనుకూల శిబిరాన్ని ముందుండి నడిపిన లండన్ మాజీ మేయర్ బోరిస్ జాన్సన్ ఈ పోటీలో ముందంజలో ఉన్నారు. హోంమంత్రిథెరెసా మే కూడా తనకు అనుకూలంగా బలమైన మద్దతు కూడగడుతున్నారు.
అయితే.. ఉత్తమ ప్రధాని ఎవరు కాగలరంటూ యుగవ్ అనే సంస్థ చేసిన సర్వేలో బోరిస్ (18 శాతం) కన్నా థెరెసా(19 శాతం) వైపు స్వల్పంగా మొగ్గు ఉన్నట్లు తెలుస్తోంది. యూరోపియన్ యూనియన్ నుంచి బ్రెగ్జిట్ రెఫరెండం ద్వారా బ్రిటన్ వైదొలగడం తెలిసిందే. కాగా. బ్రిటన్ వైదొలగినా మనగలిగేంత బలంగా యూరోపియన్ యూనియన్ ఉందని జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్ మంగళవారం పేర్కొన్నారు.