సీషెల్స్‌తో బంధం బలోపేతం
ప్రధాని నరేంద్ర మోదీ
విక్టోరియా: సీషెల్స్‌తో సంబంధాలను బలోపేతం చేసుకునే దిశలో ఆ దేశానికి పెద్దఎత్తున సాయం అందించడానికి భారత్ ముందుకు వచ్చింది. ఆ దేశ జలసంపదను మ్యాపింగ్‌ద్వారా గుర్తించేందుకు సాయపడనుంది. ప్రధాని నరేంద్ర మోదీ సీషెల్స్ పర్యటన సందర్భంగా బుధవారం రెండు దేశాల మధ్య 4 ఒప్పందాలు కుదిరాయి. మూడు దేశాల పర్యటనలో భాగంగా మోదీ మంగళవారం రాత్రి సీషెల్స్ చేరుకోవడం తెలిసిందే.
రక్షణరంగంలో పరస్పర సహకారంలో భాగంగా భారత్ సాయంతో ఏర్పాటు చేసిన తీరప్రాంత నిఘా రాడార్ వ్యవస్థను మోదీ ప్రారంభించారు. సీషెల్స్‌కు మరో డోర్నియర్ విమానం ఇస్తామని, సీషెల్స్ పౌరులకు 3 నెలల ఉచిత వీసా అందిస్తామని ప్రకటించారు. రాజధాని విక్టోరియాలో మోదీ.. సీషెల్స్ అధ్యక్షుడు అలెక్స్ మైఖేల్‌తో పలు అంశాలపై చర్చించారు. పునరుత్పాదక ఇంధన వనరులు, మౌలిక వసతుల అభివృద్ధికి సంబంధించి రెండు దేశాలమధ్య ఒప్పందాలు కుదిరాయి.
మారిషస్‌తో ఐదు ఒప్పందాలు..
సీషెల్స్‌లో పర్యటన ముగించుకున్న మోదీ మారిషస్ రాజధాని పోర్ట్‌లూయీ చేరుకున్నారు. మారిషస్ అధ్యక్షుడు ప్రయాగ్, ప్రధాని అనిరుధ్ జగన్నాథ్‌లతో భేటీ అయ్యారు. భారత్, మారిషస్‌లు పలు అంశాలపై ఐదు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి.