సెనేట్ కమిటీకి అమెరికా సర్కారు ప్రతిపాదన
వాషింగ్టన్: వీలైనంత ఎక్కువ మంది విదేశీ విద్యార్థులను ఆకట్టుకునేందుకు అమెరికా అడుగులేస్తోంది. కొన్ని రకాల నైపుణ్య కోర్సుల్లో చేరే విదేశీ విద్యార్థులకు ఏకంగా ఆరేళ్ల వర్క్ పర్మిట్ ఇవ్వాలని ఒబామా సర్కారు యోచిస్తోంది. దీనివల్ల భారతీయ విద్యార్థులకే ఎక్కువగా ప్రయోజనం చేకూరనుంది. అమెరికాలో సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, గణితం కోర్సులను ‘ఎస్‌టీఏఎం(స్టెమ్)’గా పిలుస్తారు. వీటిలో చేరే విద్యార్థులకు ఆరేళ్ల వీసా ఇస్తారు. దీంతో మూడేళ్ల డిగ్రీ కోర్సులు పూర్తికాగానే మరో మూడేళ్లు పనిచేసేందుకు అవకాశం లభిస్తుంది.
ప్రస్తుతం సాధారణ డిగ్రీలు పూర్తి చేసే విదేశీ విద్యార్థులకు 12 నెలల వర్క్ పర్మిటే ఇస్తున్నారు. స్టెమ్ విద్యార్థులకు మరో 17 నెలల అదనపు సమయం లభిస్తోంది. వీరికి మూడేళ్ల గడువు ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు సెనేట్ జ్యుడీషియరీ కమిటీకి ప్రతిపాదించింది. అయితే ఈ కమిటీకి చైర్మన్‌గా ఉన్న రిపబ్లికన్ పార్టీ నేత, సెనేటర్ చక్ గ్రాస్లీ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఈ కొత్త ప్రతిపాదనలు బాధ్యతారాహిత్యంతో కూడుకున్నవని, ప్రమాదకరమని, ఈ కార్యక్రమంలో మోసాలు జరిగే అవకాశముందంటూ అంతర్గత భద్రతా కార్యదర్శికి లేఖ రాశారు.
విదేశీ విద్యార్థులకు ఆరేళ్ల వర్క్ పర్మిట్
Published Thu, Jun 11 2015 2:02 AM | Last Updated on Thu, Apr 4 2019 3:41 PM
Advertisement
Advertisement