సాక్షి నాలెడ్జ్ సెంటర్: అమెరికా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో చేరే విదేశీ విద్యార్థులు 2017–18 విద్యా సంవత్సరంలో మొత్తంగా 7 శాతం తగ్గిపోగా భారత విద్యార్థుల సంఖ్యలో రెండంకెల వృద్ధి నమోదైంది. అమెరికాలోని 522 విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో విదేశీ విద్యార్థుల చేరికలపై ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్ (ఐఐఈ) ఓ సర్వే చేసింది. ‘ఫాల్ 2017 ఇంటర్నేషనల్ స్టూడెంట్ ఎన్‌రోల్‌మెంట్ స్నాప్‌షాట్ సర్వే’ పేరిట చేసిన ఈ సర్వేలో పలు విషయాలు వెల్లడయ్యాయి. గతేడాదితో పోలిస్తే అమెరికాలోని 45 శాతం విద్యాసంస్థల్లో కొత్తగా చేరిన విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గింది. మరో 24 శాతం విద్యాసంస్థల్లో తటస్థంగా ఉంది. 31 శాతం విద్యాసంస్థల్లోనే విదేశీ విద్యా ర్థుల చేరికలో వృద్ధి నమోదైం ది. ఈ ఏడాది అమెరికాకు వచ్చిన విదేశీ విద్యార్థుల సంఖ్య పరంగా భారత్ రెండో స్థానంలో ఉంది. మూడున్నర లక్షల మంది విద్యార్థులతో చైనా తొలి స్థానంలో నిలవగా, భారత్ నుంచి 1,86,267 మంది అమెరికా వచ్చారు.
గతేడాది ఇండియా నుంచి వచ్చిన వారు 1,65,918 మంది. అంటే భారతీయ విద్యార్థులసంఖ్యలో ఈ ఏడాది 12.3శాతం వృద్ధి నమోదైంది. చైనా విష యంలో ఈ వృద్ధి 6.8 శాతమే. కానీ విద్యార్థుల సంఖ్య పరంగా మాత్రం చైనానే తొలిస్థానంలో ఉంది. అమెరికాలో ఉంటున్న భారతీయ విద్యార్థుల సంఖ్య మొత్తం విదేశీ విద్యార్థుల్లో దాదాపు యాభై శాతం. ఈ ఏడాది విదేశీ విద్యార్థుల సంఖ్య తగ్గేందుకు అమెరికాలోని సామాజిక, రాజకీయ అనిశ్చి త వాతావరణమే ప్రధాన కారణమని భావి స్తున్నారు. అలాగే వీసాల నిరాకరణ లేదా జారీలో జాప్యం, అధికవ్యయం, ఇతర దేశా ల నుంచి పోటీ వంటివి ప్రభావం చూపినట్లుగా వివిధ విశ్వవిద్యాలయాలు అభిప్రాయపడ్డాయి. గతంలో అధికసంఖ్యలో విద్యార్థులు వచ్చిన బ్రెజిల్ నుంచి ఈసారి 32% మంది, సౌదీ ఆరేబియా నుంచి 14% మంది తగ్గిపోయారు. ప్రభుత్వం అందించే ఉపకారవేతనాల్లో కోత కారణంగా ఈ పరిణామం చోటుచేసుకుందని ఐఐఈ తెలిపింది.
.
Comments
Please login to add a commentAdd a comment