
ఇరాక్‌లో ఆత్మాహుతి దాడి
47 మంది మృతి; 72 మందికి గాయాలు
బాగ్దాద్: ఇరాక్‌లోని హిల్లాసిటీ శివార్లలో ఆదివారం జరిగిన ఆత్మాహుతి దాడిలో 20 మంది భద్రతా సిబ్బందిసహా మొత్తం 47 మంది మరణించారు. అక్కడి ప్రధాన తనిఖీ కేంద్రం వద్ద పేలుడు పదార్థాలున్న ట్రక్కుతో వచ్చిన మానవబాంబు తనను తాను పేల్చేసుకోవడంతో ఈ ఘటన జరిగింది. ఈ ఘటనలో 72 మంది గాయపడ్డారు. కాగా, ఈజిప్టులోని ఉత్తర సినాయ్ ప్రావిన్సులో జరిగిన వేర్వేరు ఘటనల్లో ఐదుగురు మిలిటెంట్లు, ఇద్దరు పోలీసులు, ఓ వైద్య సహాయకుడు మరణించారు.