జైలుపై తాలిబాన్ దాడి..350 మంది ఖైదీల పరారీ | Taliban attack on the prison | Sakshi
Sakshi News home page

జైలుపై తాలిబాన్ దాడి..350 మంది ఖైదీల పరారీ

Published Tue, Sep 15 2015 2:10 AM | Last Updated on Sun, Sep 3 2017 9:24 AM

Taliban attack on the prison

ఘజ్ని: అఫ్ఘానిస్తాన్‌లో ఓ జైలుపై తాలిబాన్ మిలిటెంట్లు దాడికి తెగబడి, వందలాది మంది ఖైదీలను విడిపించారు. ఘజ్ని నగరంలో సోమవారం వేకువజామున 2.30కి  సైనిక దుస్తుల్లో వచ్చిన దుండగులు జైలు ముందు కారు బాంబు పేల్చడంతో గేట్లు బద్దలయ్యాయి. 350 మందికిపైగా ఖైదీలు తప్పించుకున్నారు.  ఈ ఘటనలో నలుగురు అఫ్ఘాన్ పోలీసు అధికారులు మృతిచెందగా, ఏడుగురు గాయపడ్డారు. జైలు తమ అధీనంలో ఉందని, అమాయకులకు స్వేచ్ఛను కల్పించామని తాలిబాన్ ప్రతినిధి చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement