బ్యూటిఫుల్ బాయ్స్ తో పోలీసులకు ఎర
తరిన్ కోట్: అఫ్ఘనిస్థాన్‌లో పోలీసులపై దాడులకు తాలిబన్ ఉగ్రవాద సంస్థ నీచమైన కార్యక్రమాలకు ఒడిగడుతోందని తాజాగా వెల్లడైంది. దక్షిణ అఫ్ఘనిస్థాన్‌లో ఉరుజ్గాన్ ప్రాంతంలోని పోలీసులను లైంగికపరంగా ఆకర్షించి వారిని చంపడానికి అందమైన బాలురను ఎరగా వినియోగిస్తోంది. అందమైన, గడ్డంలేని బాలురను పోలీసుల ఇలాకాల్లోకి పంపించిన తర్వాత అక్కడి అధికారులు, సిబ్బందిపై విష ప్రయోగం లేదా ఇతర రకాల దాడులు చేయిస్తోంది.
ఈ ఏడాది జనవరి నుంచి ఏప్రిల్ వరకూ జరిగిన ఇలాంటి దాడుల్లో వందలాది పోలీసులు మృత్యువాత పడ్డారని అధికారులు తెలిపారు. పోలీసులకు ఉన్న బలహీనతని తాలిబన్ కనిపెట్టి ఈ దాడులు చేయిస్తోందని పోలీస్ అధికారి ఒకరు చెప్పారు. లైంగిక బానిస (బచ్చా బాజీ)గా వచ్చిన ఒక అబ్బాయి ఏడుగురు పోలీసులపై కాల్పులు జరిపి చంపడం తాను చూశానని మటిఉల్లా అనే జవాను తెలిపాడు.